For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇంతలా ఒళ్లు పెంచేతే..వేషాలు ఎవరిస్తారు? (ఫొటో)

  By Srikanya
  |

  హైదరాబాద్ : ఖాళీగా ఉన్నాం కదా అని ఒళ్లు పెంచి, ఫోటోలు దిగటం మామూలు వాళ్లకే కాస్త ఇబ్బంది గా ఉండే అంశం. అలాంటిది సినిమా హీరోయిన్స్ కి, క్యారెక్టర్ ఆర్టిస్టులకు ఎంత ఇబ్బందో ఆలోచించండి. అయితే అవేమీ పట్టించుకునేటట్లు లేదు సోనియా. ఆమె రీసెంట్ గా దిగిన ఫొటో ఇప్పుడు అంతర్జాలంలో చక్కర్లు కొడుతోంది. అది చూసిన వారు ఆమె సోనియానేనా అని ఆశ్చర్యపోతున్నారు. ఆమె అభిమానులు మాత్రం పాత సోనియాతో పోల్చుకుని బాధపడుతున్నారు.

  హ్యాపీడేస్,వినాయుకుడు సినిమాలతో ఒక్క సారిగా వెలుగులోకి వచ్చిన బ్యూటి సోనియా. ఆ రెండు సినిమాలు మంచి విజయాన్ని సాధించటంతో ఈ తెలుగు అమ్మాయికి బయిట మంచి ఆఫర్స్ వచ్చాయి. అయితే ఆమె సెలక్టివ్ గా ఉండాలని భావించి ఏదీ ఒప్పుకోలేదు.'హ్యాపీడేస్‌' శ్రావ్స్‌గా యూత్‌లో విపరీతమైన క్రేజు తెచ్చుకున్న అందాల నాయిక సోనియా. ఆ తర్వాత 'వినాయకుడు'తో తనలోని నటిని పూర్తిస్థాయిలో ఆవిష్కరించి మన్ననలు అందుకున్నారు. ఆపై 'బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం'లో శివాజీ సరసన నాయికగా నటించి మెప్పించారు. ఇటీవలి మహేష్‌ 'దూకుడు'లో ఓ అతిథి పాత్రలో తళుక్కున మెరిశారు. సర్లే కృష్ణుడు సరసన మరోసారి మిస్టర్ మన్మధ చిత్రం చేసి మరీ అదృష్టాన్ని పరీక్షించుకుంది. అదీ వర్కవుట్ కాలేదు. దాంతో ఆమె ఇలా ఒళ్లు పెంచుకునే కార్యక్రమం పెట్టుకుంది.

  Sonia shows off her fatty waist

  ఆమధ్యన మీడియాతో మాట్లాడుతూ... ఈ మధ్య కా లంలో శరీరాకృతిలో చాలా మార్పొచ్చింది. దా నిని మార్చి తిరిగి పూర్వ స్థితికి రావడానికి ప్ర యత్నిస్తున్నా. అందుకోసం 7 నెలల నుంచి పూ ర్తిగా ఆహారనియమాలు పాటించి వర్కౌట్స్‌ చేస్తు న్నా. 10 కేజీల బరువు కూడా తగ్గాను. 'హ్యాపీడే స్‌'లో శ్రావ్స్‌లా మారిపోవాలనే ఈ ప్రయత్నం అని చెప్పుకొచ్చింది. కానీ అదేమీ సీరియస్ గా తీసుకున్నట్లు లెదు.

  తొలి సినిమా విజయం తర్వాత శ్రావ్స్‌.. చాలా వేగంగా పెద్ద హీరోయిన్ అయిపోతుందని భావించారంతా. అయితే కెరీర్‌ ప్లానింగ్‌లో కొన్ని లోపా లున్నాయి. నిజానికి నేను అనుకోకుండా 'హ్యా పీడేస్‌'లోకి ప్రవేశించాను. అప్పటికి సినిమాకి సంబంధించి ఏ ప్రణాళికలు లేవు. ఆ తర్వాత 'వినాయకుడు' హిట్‌ అందుకున్నాక... కెరీర్‌ ను ఇక్కడే పూర్తి స్థాయిలో మలుచుకోవాలని అనుకున్నాను. అయితే ఆరంభంలోని అలస త్వం ప్రభావం ఆ తర్వాత కెరీర్‌పై పడింది. నాకు వ్యక్తిగతంగా మేనేజర్‌, పి.ఆర్‌. కమ్యూని కేషన్‌ రెండూ లేకపోవడం కూడా కొంత మైనస్‌. ఇటీవల కాలంలో గిరిధర్‌ను మేనేజర్ గా నియమించుకున్నాను. కెరీర్‌ పరంగా ఇకముందు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ముందుకు సాగాలని అనుకుంటున్నా అన్నారు.

  English summary
  Happy Days fame Sonia was seen at an event, but what distracted most of the onlookers was her flabby waist she left to air.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X