‘టెంపర్’లో ఆ దర్శకుడి మాజీ భార్య నటిస్తోందా?

By Bojja Kumar

హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘టంపర్' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ మాజీ భార్య, నటి సోనియా అగర్వాల్ కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ భామ తెలుగులో వచ్చిన ‘7/జి బృందావన్ కాలనీ' చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సోనియా అగర్వాల్ కీలకపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. సినిమా చివర్లో ఓ 20 నిమిషాల పాటు ఆమె స్పెషల్ అప్పియరెన్స్ ఉంటుందని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Soniya Agarwal plays key role in Temper

ఈ చిత్రం ఆడియో ఈనెల 28న విడుదల చేయడానికి నిర్మాత బండ్ల గణేష్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఆడియోకి నందమూరి బాలకృష్ణ వచ్చే అవకాశం ఉందని ఫిలింనగర్‌ సమాచారం. దీంతో నందమూరి అభిమానుల్లో సందడి వాతావరణం ఏర్పడుతుంది. అయితే బాబాయ్‌-అబ్బాయ్‌ని ఒకే వేదికపై చూడాలనేకునే అభిమానులు ఆరోజు కోసం వేచి చూస్తున్నారు.

ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు. సినిమాకు మ్యూజిక్ హైలెట్ అవుతుందని అంటున్నారు. ఫిబ్రవరి 12న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఫుల్‌లెంగ్త్‌ కమర్షియల్‌, మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన ముద్దుగుమ్మ కాజల్‌ నటిస్తుంది. ఈ సినిమాపై అభిమానులు భారీ ఎత్తున ఆశలు పెట్టుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X