శృంగార దేవతను మరిపిస్తున్న సోనియా (ఫోటోస్)
శ్రీకాంత్, సోనియామాన్ జంటగా మహాలక్ష్మీ ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై జొన్నలగడ్డ శ్రీనివాసరావు స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘ఢీ అంటే ఢీ'. త్వరలో ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరోయిన్ సోనియా మాన్ హాట్ ఫోటోలను విడుదల చేసారు.
సోనియామాన్ అందాలను హాట్ అండ్ సెక్సీగా ఫోకస్ చేస్తూ ఆమెను శృంగార దేవతలా ప్రజెంట్ చేసారు. సినిమా గురించి ఎవరూ పట్టించుకోక పోయినా...సోనియామాన్ హాట్ ఫోటోల పుణ్యమాని యువత ఈ చిత్రం చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. మరి సోనియామాన్ ఒలికించిన శృంగార రసం కేవలం ఫోటోలకే పరిమితమా? లేక సినిమాలో కూడా ఉంటుందా? అనేది సినిమా విడుదలైతే కానీ చెప్పలేం.
స్లైడ్ షోలో సోనియామాన్ హాట్ ఫోటోలు, సినిమాకు సంబంధించిన వివరాలు...

సినిమా కథాంశం
యాక్షన్, చైల్డ్ సెంటిమెంట్‌తో పాటు పాత్రల మధ్య గమ్మత్తైన సవాల్‌లతో ఢీ అంటే ఢీ అంటూ కథ సాగుతుంది.

బ్రహ్మానందం కామెడీ
పూర్తిస్థాయి వినోదభరితంగా సాగే ఈ చిత్రానికి బ్రహ్మానందం పాత్ర ప్లస్ పాయింట్ అవుతుంది అని రచయిత రాజేంద్రకుమార్ తెలిపారు.

నటీనటులు
చలపతిరావు, పోసాని,సత్యకృష్ణ, రఘు కారుమంచి, తాగుబోతు రమేష్, దువ్వాసి, గుండు హనుమంతరావు తదితరులు నటిస్తున్నారు.

టెక్నీషియన్స్
ఈ చిత్రానికి కథ: భూపతిరాజు, మాటలు:రాజేంద్రకుమార్, సంగీతం: చక్రి, ఎడిటింగ్: గౌతమ్‌రాజు, కెమెరా: సిహెచ్.గోపీనాధ్, పాటలు: చంద్రబోస్, నిర్మాత, దర్శకత్వం: జొన్నలగడ్డ శ్రీనివాసరావు.

విడుదల తేదీ
అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి, ఈ నెలాఖరుకు సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

డైరెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ...
''ఇటీవలే ఐటమ్ సాంగ్ చిత్రీకరణతో సినిమా పూర్తయిపోయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాను. ఈ సినిమా బిగినింగ్ నుంచి ఎడిటింగ్ వరకూ మంచి ఎంటర్ టైన్ మెంట్ గా ఉంటుంది. అవుట్ ఫుట్ బాగా వచ్చింది. దీనికి కారణం టీమ్ వర్క్. సాంగ్స్ అన్నీబాగుంటాయి అన్నారు.

ఐటం సాంగ్
ఈ సినిమాలో ఐటమ్ పాట హైలెట్ గా నిలుస్తుంది. ఏ.పి టు తెలంగాణా పై ఈ ఐటమ్ పాట ఉంటుంది. చంద్రబోస్ ఈ పాటకు రాసిన లిరిక్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ నెలాఖరకు సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని తెలిపారు.

హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ...
''ఢీ అంటే ఢీకి కథ భూపతిరాజాగారు ఇచ్చారు. ఇప్పటిదాకా ఆయన కథలు అందించిన చిత్రాలు మంచి విజయం సాధించాయి. ముత్యాల సుబ్బయ్యగారి దగ్గర అసోసియేట్ గా పని చేస్తునప్పట్నుంచి జొన్నలగడ్డ శ్రీనివాసరావుగారు నాకు తెలుసు. బాగా ఎక్స్ పీరియన్స్ ఉన్న డైరెక్టర్ అన్నారు.

టాప్ మోస్ట్ టెక్నీషియన్స్
ఈ సినిమాకి టాప్ మోస్ట్ టెక్నీషియన్స్ వర్క్ చేసారు. సాంగ్స్, ఫైట్స్ చాలా బాగా కుదిరాయని శ్రీకాంత్ తెలిపారు.

బ్రహ్మానందం
ఈ చిత్రంలో బ్రహ్మానందంగారి పాత్ర చాలా బాగుంటుంది. ఇందులో బ్రహ్మానందంగారు రెండు పాత్రలు చేసారు. ఆయన కొడుకు పాత్ర కూడా ఆయనే చేసారు. చాలా వెరైటీగా ఈ రెండు పాత్రలు ఉంటాయని శ్రీకాంత్ తెలిపారు.

పోలీసాఫీసర్ పాత్ర
నేను ఇందులో స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేసాను. అలాంటి పోలీసాఫీసర్ స్కూలు పిల్లల బాధ్యత తీసుకుంటే ఎలా ఉంటుందనేదే ఈ సినిమా కాన్సెఫ్ట్ అని శ్రీకాంత్ తెలిపారు.

విజయంపై నమ్మకం
సినిమా అంతా ఓ గేమ్ లా ఉంటుంది. హీరోయిన్ చక్కగా నటించింది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాము. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను'' అన్నారు శ్రీకాంత్.


Click it and Unblock the Notifications











