For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వేణు మాధవ్ మరణంపై పెదవి విప్పిన కొడుకులు: ఆయనకు గర్ల్‌ఫ్రెండ్స్ ఎక్కువ.. అదే ప్రాణం తీసిందంటూ!

  |

  సాదాసీదాగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌ కమెడియన్‌గా ఎదిగిపోయారు వేణు మాధవ్. ఎన్నో సినిమాల్లో అద్భుతమైన హాస్యాన్ని పండించిన ఆయన.. చాలా మరపురాని పాత్రలను చేశారు. అలా దాదాపు రెండు దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకులను అలరించారు. అలాంటిది వేణు మాధవ్ 2019లో అకస్మాత్తుగా ప్రాణాలను విడిచి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయన మరణంపై ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వేణు మాధవ్ భార్య, కుమారులు ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా అసలు వేణు మాధవ్ మరణానికి కారణం ఏంటి? ఆయన చనిపోయే ముందు ఏం జరిగింది? అనే విషయాలను బయటపెట్టారు. ఆ వివరాలేంటో మీరే చూడండి!

  అనారోగ్యంతో కన్నుమూసిన వేణు

  అనారోగ్యంతో కన్నుమూసిన వేణు

  సుదీర్ఘ కాలం పాటు తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్‌గా హవాను చూపించిన వేణు మాధవ్.. ఊహించని విధంగా 2019 సెప్టెంబర్ 25వ తేదీన మరణించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఆయన తుది శ్వాస విడిచారు. వేణు మాధవ్ మరణం ఆయన అభిమానులకే కాకుండా సినీ ఇండస్ట్రీకే పెద్ద లోటు అయిపోయింది.

  ప్రియాంక చోప్రా ఎద అందాల ఆరబోత: బటన్స్ విప్పేసి మరీ హాట్ షో

  మృతిపై ఎన్నో రకాల ప్రచారాలు

  మృతిపై ఎన్నో రకాల ప్రచారాలు

  కమెడియన్ వేణు మాధవ్ మరణించిన తర్వాత ఎన్నో రకాల ప్రచారాలు వచ్చిన విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆయన తాగుడు, స్మోకింగ్ లాంటి వ్యసనాలకు అలవాటు పడి చనిపోయారనే వార్తలు వచ్చాయి. మరికొందరైతే వేణు మాధవ్ ఓ ప్రాణాంతకమైన వ్యాధితో మృతి చెందారని కూడా టాక్ వినిపించింది. దీంతో ఇది అప్పట్లో మిస్టరీగా మారిపోయింది.

  కొడుకులు.. భార్య ఇంటర్వ్యూల్లో

  కొడుకులు.. భార్య ఇంటర్వ్యూల్లో

  వేణు మాధవ్ చనిపోయిన బాధలో ఉన్న కుటుంబ సభ్యులకు.. ఆయన మరణం గురించి వచ్చిన వార్తలు మరింత ఇబ్బంది పెట్టాయి. ఈ నేపథ్యంలో ఈ కమెడియన్ భార్య శ్రీవాణి, కొడుకులు సావికర్, ప్రభాకర్ తరచూ ఇంటర్వ్యూలు ఇవ్వడం.. అందులో ఆయన మరణానికి సంబంధించిన కారణాలు చెప్పడం వంటివి చేశారు. దీంతో ఎన్నో రకాల పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టేశారు.

  బట్టలు లేకుండా చరణ్ హీరోయిన్: ఆ పార్టును మాత్రమే చూపిస్తూ దారుణంగా!

  ఆయన తండ్రి అని చెప్పుకోమని

  ఆయన తండ్రి అని చెప్పుకోమని

  లెజెండరీ కమెడియన్ వేణు మాధవ్ భార్య శ్రీవాణి, కొడుకులు సావికర్, ప్రభాకర్‌తో కలిసి తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా కుమారులు మాట్లాడుతూ.. 'మేము వేణు మాధవ్ కొడుకులం అని ఏనాడూ బయట చెప్పుకోలేదు. ఆయన ఎంత స్టార్ అయినా దాన్ని మేము యూజ్ చేసుకోలేదు. అందరితో మామూలుగానే ఉన్నాం' అని చెప్పారు.

  మమ్మల్ని ఎప్పుడూ అలా చూడలే

  మమ్మల్ని ఎప్పుడూ అలా చూడలే

  యూట్యూబ్ ఛానెల్‌తో జరిగిన చిట్ చాట్‌తో వేణు మాధవ్ కుమారులు మాట్లాడుతూ.. 'నాన్నగారు ఇంట్లో చాలా ఆనందంగా ఉండేవారు. సినిమాల్లో కంటే ఇంట్లోనే ఎక్కువ ఫన్ ఉండేది. ఆయన ఏ రోజూ మమ్మల్ని ఓ తండ్రిలా కొట్టడం, తిట్టడం చేసేవారు కాదు. మేమంతా ఫ్రెండ్స్‌లానే ఉండేవాళ్లం. అందుకే ఆయన లేని లోటు మాకు బాగా కనిపిస్తూ ఉంటుంది' అని బాధ పడ్డారు.

  Bigg Boss 6: జబర్ధస్త్‌కు కోలుకోలేని షాక్.. బిగ్ బాస్‌లోకి టాప్ లేడీ కమెడియన్.. హౌస్‌లో రచ్చ రచ్చే

  నాన్నకు గర్ల్‌ఫ్రెండ్స్ ఎక్కువంటూ

  నాన్నకు గర్ల్‌ఫ్రెండ్స్ ఎక్కువంటూ

  ఇదే ఇంటర్వ్యూలో వేణు మాధవ్ కుమారులు కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. 'నాన్న గురించి మా టీచర్లకు కూడా చెప్పేవాళ్లం కాదు. ఆయన మా స్కూల్‌కు వస్తామన్నా మేమే వద్దనే వాళ్లం. ఎందుకంటే నాన్నకు ఎక్కువ గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు. మా క్లాస్‌లో కూడా ఆయనకు గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు' అని చెప్పారు. అయితే, ఇదంతా సరదాగానే అన్నట్లు తర్వాత వెల్లడించారు.

   వేణు మాధవ్ మరణానికి కారణం

  వేణు మాధవ్ మరణానికి కారణం

  ఈ ఇంటర్వ్యూలో వేణు మాధవ్ భార్య శ్రీవాణి తన భర్త మరణంపై క్లారిటీ ఇచ్చారు. 'ఆయన నిజంగా చనిపోకముందే మీడియాలో వార్తలు వచ్చాయి. దీనికితోడు ఆయనపై నెగెటివ్ ప్రచారం కూడా బాగా జరిగింది. అయితే, నిజానికి మా వారు డెంగ్యూ ఫీవర్ రావడం వల్లే మరణించారు. సరైన కేర్ తీసుకోకపోవడం ఆయన ప్రాణం మీదకు తీసుకు వచ్చింది' అని క్లారిటీ ఇచ్చారు.

  Bigg Boss: నక్కతోక తొక్కిన ఆరియానా గ్లోరీ.. బుల్లితెర చరిత్రలో నేషనల్ రికార్డు

   ఆయన చనిపోవడంతో డిప్రెషన్

  ఆయన చనిపోవడంతో డిప్రెషన్

  వేణు మాధవ్ చనిపోవడానికి ముందే ఓ విషాదకర సంఘటన జరిగిందని శ్రీవాణి చెప్పారు. 'మా ఆయన చనిపోవడానికి మూడు నెలల ముందే ఆయన బ్రదర్ కన్నుమూశారు. ఆ సమయంలో ఆయన ఎంతో డిప్రెషన్‌కు లోనయ్యారు. ఎందుకంటే తన బ్రదర్స్‌తో ఆయన ఎంతో సన్నిహితంగా ఉండేవారు. అలాంటిది ఒక్కసారిగా బ్రదర్ చనిపోవడం ఆయనను బాధించింది' అన్నారు.

  మరణంపై పెదవి విప్పిన సన్స్

  మరణంపై పెదవి విప్పిన సన్స్

  వేణు మాధవ్ మరణంపై కొడుకులు కూడా ఈ ఇంటర్వ్యూలో మాట్లాడారు. 'నాన్నగారికి డ్రింక్ అలవాటు ఉండేది. కానీ, ఆయన మరణానికి అది కారణం కాదు. డైట్ విషయంలో ఎక్కువ కంట్రోల్ తీసుకోవడం, అలాగే డెంగ్యూ ఫీవర్ వచ్చినా ఆసుపత్రికి వెళ్లకపోవడంతో ఆయన ఊపిరితిత్తులు చెడిపోయి మరణానికి కారణమయ్యాయి' అని తొలిసారి పెదవి విప్పారు.

  English summary
  Tollywood Star Comedian Venu Madhav Passed Away Few Years Back. Recently His Sons and Wife Gave Clarity on Venu Madhav Death.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X