'సొంత ఊరు' కమర్షియల్ గా క్లిక్ కాకున్నా...
సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన సొంత ఊరు చిత్రం కమర్షియల్ గా సక్సెస్ కాకున్నా ఫెస్టివల్స్ కు వెళుతూ క్రేజ్ తెచ్చుకుంటోంది. తాజాగా ఈ చిత్రం కేరళ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంపికైంది. డిసెంబర్ 11 వ తేదీనుండి ఈ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభం కానుంది. త్రివేండ్రం లో జరిగే ఈ ఫెస్టివల్ కు భారతీయ చిత్రాల సెక్షన్ కు కేవలం ఇరవై చిత్రాలు మాత్రమే ఎంపిక చేస్తారు. అందులో సొంతఊరు ఉండటం విశేషం. ఇక ఈ చిత్రం ముంబయి ఫిల్మ్ ఫెస్టివల్ కూడా ప్రదర్శింపబడి అందరి ప్రశంసలు పొందిన సంగతి తెలిసిందే. 'ఆనంద్' ఫేమ్ రాజా, తీర్థ (తొలి పరిచయం) జంటగా శ్యావ్య ఫిలింస్ పతాకంపై వై.రవీంద్రబాబు, కిషోరీ బసిరెడ్డి నిర్మించిన చిత్రం 'సొంత ఊరు'. పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకుడు.ఎల్.బి.శ్రీరాం కాట కాపరిగా ప్రత్యేకపాత్రలో కనపడతారు.
సొంత ఊరు సునీల్ కుమార్ రెడ్డి రాజా ఎల్ బి శ్రీరాం ఫిల్మ్ ఫెస్టివల్ త్రివేండ్రం తీర్ధ ఆనంద్ కేరళ kerala film festival sunil kumar reddy raja thirdha sontha vuru aanand lb sriram


Click it and Unblock the Notifications