నేను ముస్లిం కాదు, ఇది గుండాగిరి అంటూ... సోను నిగమ్ వివాదాస్పద ట్వీట్స్

ప్రముఖ బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్ చేసిన ట్వీట్లు వివాదాస్పదం అయ్యాయి. భారత దేశంలో బలవంతపు మతత్వం ఎప్పుడూ ముగుస్తుందో... ఇదో గుండా గిరి లాంటిదే అంటూ సోనూ నిగమ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేసారు.

By Bojja Kumar

హైదరాబాద్: ప్రముఖ బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్ చేసిన ట్వీట్లు వివాదాస్పదం అయ్యాయి. భారత దేశంలో బలవంతపు మతత్వం ఎప్పుడూ ముగుస్తుందో... ఇదో గుండా గిరి లాంటిదే అంటూ సోనూ నిగమ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేసారు.

సోనూ నిగమ్ ఇలా మతాలపై విరుచుకుపడటానికి కారణం.... మసీదు నుండి ఉదయం మైకులో వినిపించే ఆజాన్(ప్రార్థన). ఆజాన్ శబ్దానికి సోనూ నిగమ్ నిద్రాభంగానికి గురి కావడంతో వెంటనే ట్విట్టర్లో తన కోపాన్ని వెల్లగక్కాడు.

నేను ముస్లింను కాదు..

నేను ముస్లింను కాదు..

ఆజాన్ శబ్దంతో నిద్రలేని సోనూ నిగమ్... ‘అందరినీ దేవుడు చల్లగా చూడాలి. నేను ముస్లింని కాను. అయినా ఉదయాన్నే వినిపించే ఆజాన్‌ పిలుపుతో నిద్రలేవాలి. భారతదేశంలో ఈ బలవంతపు మతతత్వం ఎప్పుడు ముగుస్తుందో... అంటూ అంటూ ట్వీట్ చేసాడు.

అప్పుడు కరెంటు లేదు.

అప్పుడు కరెంటు లేదు.

ఇస్లాం మతాన్ని మహ్మద్ ప్రవక్త స్థాపించినపుడు కరెంటు లేదు. అప్పట్లో ఇలా మైకులో ఆజాన్ వినిపించడం లాంటివి ఏమీ లేవు. ఎడిసన్‌ బల్బును కనిపెట్టిన తర్వాతే గోల ఎందుకు? అంటూ సోనూ నిగమ్ ట్వీట్ చేసారు.

మతాన్ని అనుసరించని వారిని

మతాన్ని అనుసరించని వారిని

ఉదయాన్నే ధ్వనులతో నిద్రలేపే ఆలయాలు, గురుద్వారాలను నేను నమ్మను..... మరో వివాదాస్పద ట్వీట్ చేసాడు సోనూ నిగమ్.

గుండాగిరి

గుండాగిరి

ఇలా వారికి మతానికి సంబంధం లేని వారిని... ఇలా శబ్దాలతో బలవంతంగా ఎవరు నిద్రలేపినా ఇది గుండా గిరి అవుతుంది.... అని సోనూ నిగమ్ వ్యాఖ్యానించారు.

సోనూ వ్యాఖ్యలపై మిశ్రమ స్పందన

సోనూ వ్యాఖ్యలపై మిశ్రమ స్పందన

సోనూ నిగమ్ వ్యాఖ్యలపై బాలీవుడ్ ప్రముఖుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. బాలీవుడ్ సింగర్ షాన్ స్పందిస్తూ.... సోనూ నిగమ్ ట్వీట్లను నేను సపోర్టు చేస్తున్నాను. నా ఫ్రెండ్ అని కాదు... అతడు చెప్పింది కరెక్ట్ అన్నారు. మరో సింగర్ బాబా సైగల్ స్పందిస్తూ... ఇదో సున్నితమైన విషయం. నేను సిక్కును. నాకు చాలా మంది ముస్లిం, హిందూ ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ఇలాంటి వివాదాస్పద ట్వీట్లు ఎప్పటికీ చేయను అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X