ఇకపై విలన్స్ రోల్స్ చేసేది లేదంటోన్న సోనూ సూద్.. స్క్రిప్ట్‌లో భారీ మార్పులు!!
ఒకప్పుడు సోనూ సూద్ భయంకరమైన విలన్. తెరపై నటనలో భాగంగానే విలనిజాన్నిపండించినా కూడా సోనూ సూద్‌ను విలన్‌గానే చూసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. సోనూ సూద్ నేషనల్ ఐకాన్. బ్రదర్ ఆఫ్ ది నేషన్ అనే స్థాయికి ఎదిగాడు. ఇప్పుడున్న ఇండియన్ సెలెబ్రిటీల్లో ఎవ్వరికీ కూడా సోనూసూద్ అంతటి గౌరవాన్ని అందుకునే స్థాయి లేదు. అంతలా జనాలు సోనూ సూద్‌ను ఆదరిస్తుంటే.. సినిమా మేకర్స్ మాత్రం కాస్త ఝంకుతున్నారట.

ఒకప్పటిలా క్యారెక్టర్స్..
అయితే సోనూ సూద్ లాక్డౌన్, కరోనా లాంటి కష్ట కాలంలో చేసిన సేవ, ఇంకా చేస్తున్న సహాయ కార్యక్రమాలు ప్రజల్లో గుండెల్లో చెరగని ముద్ర వేశాడు. ఇప్పుడు ఎంతో మందికి సోనూ సూద్ నడిచే దైవంలాంటివాడు. అలాంటి సోనూ సూద్‌ను మునుపటిలా హీరో చేతిలో దెబ్బలు తినే పాత్రల్లో చూసి ఒప్పుకోగలరా?, విలన్ రోల్స్‌లో సోనూ సూద్‌ను చూస్తే తట్టుకోగలరా? అని మేకర్స్ కాస్త ఆలోచిస్తున్నారట.

అందుకే అలా..
ప్రస్తుతం సోనూ సూద్ ఒప్పుకున్న ప్రాజెక్ట్‌ల్లోనూ భారీ మార్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే అల్లుడు అదుర్స్ సినిమాలో చాలా వరకు స్క్రిప్ట్‌ను మార్చేశారట. సోనూ సూద్‌కు ఇప్పుడున్న క్రేజ్‌కు తగ్గట్టు.. పాటలుకూడా యాడ్ చేశారట. దాని కోసం బెల్లంకొండ శ్రీనివాస్ స్టోరీని కూడా తగ్గించారని తెలుస్తోంది.

ఇకపై నో విలన్..
వాటిపై సోనూ సూద్ స్పందించాడు. ఇకపై విలన్ వేషాలు వేసే ప్రసక్తి లేదని చెప్పాడు. ఇక మంచి, పాజిటివ్ సపోర్టింగ్ రోల్స్ చేస్తాను.. ఇప్పటికే మంచి కథలు చాలా విన్నాను అని సోనూ సూద్ చెప్పుకొచ్చాడు. ఇకపై ఏడాదికి వీలైనన్ని సినిమాలు చేయాలని ఫిక్స్ అయినట్టు తెలిపాడు.

బైక్ దాదా..
బెంగాల్‌లో బైక్ దాదా అయిన కరిముల్ హక్ అనే వ్యక్తి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న చిత్రంలో సోనూ సూద్ మెయిన్ రోల్‌ను పోషించనున్నట్టు తెలుస్తోంది. బెంగాల్ ప్రాంతంలోని మారుమూల గ్రామంలో అత్యవసర చికిత్స కోసం ఆపదలో ఉన్న వారిని తన బైక్‌ను అంబులెన్స్‌గా వాడి ప్రాణాలను కాపాడేవాడు. అతని పాత్రలో సోనూ సూద్ కనిపించనున్నట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











