twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    177 మంది అమ్మాయిలను ఆదుకొన్న సోనూసూద్.. ప్రత్యేక విమానంలో సొంత ఊర్లకు

    |

    కరోనావైరస్ కారణంగా లాక్‌డౌన్ విధించడంతో తమ స్వస్థలాలకు వెళ్లడానికి కష్టాలు పడుతున్న వలస కార్మికులకు, ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయూతనిస్తూ సోనూ సూద్ అందరి ప్రశంసలు అందుకొంటున్నారు. ఇప్పటి వరకు ఎంతో మందిని బస్సుల్లో తమ సొంత ఊళ్లకు పంపించిన సోనూ సూద్ తాజాగా 177 మంది అమ్మాయిలను విమానంలో తరలించి మరోసారి మానవత్వాన్ని చాటుకొన్నారు.

    ఈ అమ్మాయిలంతా కేరళలోని గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారని, వారిని తమ సొంత రాష్ట్రం ఒడిశాలోని కేంద్రపార జిల్లాకు ప్రత్యేక విమానంలో శుక్రవారం పంపించారు. వీరింత కొచ్చిన్ ఎయిర్‌పోర్టు నుంచి ఏయిర్ ఏషియా ఫ్లయిట్‌లో భువనేశ్వర్‌లోని ఎయిర్‌పోర్టుకు చేరుకొన్నారు.

    Sonu Sood arranged a Filght to migrant workers who stucked at Kerala

    ఈ సందర్భంగా అమ్మాయిలంతా తమ కష్టాలను చెప్పుకొని ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు నెలలుగా మా యజమాని జీతాలు చెల్లించలేదు. ఎలాగైనా మా ఇంటికి వెళ్లాలనే ఆలోచనతో ఉన్నాం. ఫ్యాక్టర్ మూసి వేయడంతో మేమంత మాకు కేటాయించిన గదుల్లోనే ఉన్నాం అని ధీనంగా చేతులు జోడించి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అమ్మాయిలను కష్టాల నుంచి బయటకు రప్పించి సొంత ఇంటికి చేర్చడంపై సోనుసూద్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

    ఇప్పటి వరకు సోనుసూద్ 12 వేల మంది వలస కార్మికులను తమ స్వస్థలాలకు పంపించారు. ఉత్తర ప్రదేశ్, కర్నాటక, బీహార్ రాష్ట్రాలకు ప్రత్యేక బస్సులు వేసి వలస కార్మికులను ఆదుకొన్నారు.

    English summary
    Bollywood actor Sonu Sood proved his humanity towards migrant workers who suffered a lot in lockdown. He arranged a Filght to migrant workers who stucked at Kerala and sent them to thier own state Odisha.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X