విలన్‌ను హీరో చేస్తున్న బెల్లంకొండ
గత కొంత కాలంగా తెలుగు సినిమాల్లో...విలన్ పాత్రలు పోషిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు బాలీవుడ్ నటుడు సోనూసూద్. యువ హీరోలకు ఏమాత్రం తీసిపోని పర్సనాలిటీ, కండలు తిరిగిన బాడీతో పాటు...మంచి నటనను ప్రదర్శించే సోనూ తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకుంటున్నాడు. అరుంధతి సినిమాలో సోనూ ప్రదర్శించిన అద్భుతం. పలువురు తెలుగు కథానాయకులు సోనుపై ముచ్చటపడి మరీ అతన్ని తమ సినిమాల్లో ప్రత్యర్థిగా పెట్టించుకుంటారంటే అతనికున్న డిమాండ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పడు ఈ విలన్ కాస్త...హీరో కాబోతున్నాడు. సోనూసూద్ హీరోగా త్వరలో తన బ్యానర్ లో సినిమా తీయనున్నట్లు ప్రముఖ నిర్మాత బెల్లం కొండ సురేష్ అధికారికంగా ప్రకటించారు. మంచి నటనా కౌశల్యం, ఫిజిక్ ఉన్న సోనూసూద్ హీరో పాత్రలకు ఏ మాత్రం తీసిపోడని, అతడు హీరోగా నిలదొక్కుకుంటాడనే నమ్మకం ఉందని బెల్లకొండ చెప్పుకొచ్చారు.
ఏదైతేనేం...ఇంతకాలం తెలుగు హీరోయిలకు సినిమాల్లో మాత్రమే సవాల్ విసిరిన సోనుసూద్ ఇప్పుడు నిజజీవితంలోనూ తన హీరోయిజంతో సవాల్ విసిరేందుకు వస్తుండటం విశేషం. ఇప్పటికే తెలుగు దర్శకుడు పూరి పుణ్యమా అని 'బుడ్డ హోగా తెరబాప్" సినిమాలో అమితాబ్ తర్వాత హీరో అంతటి పాత్రను చేసి సోనూకు...మళ్లీ తెలుగు నిర్మాత ద్వారానే హీరో అవకాశం దక్కడం గమనార్హం.


Click it and Unblock the Notifications











