అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమాలో విలన్ అతనే
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రం నవంబర్ రెండవ తేదీ నుంచి ప్రారంభం కానుందున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో విలన్ గా మొదట సుదీప్ ని అనకున్నా ఫైనల్ గా సోనూ సూద్ నే ఎంపిక చేసారు. అలాగే ఆ తనకు అన్ని రెగ్యులర్ పాత్రలే వస్తున్నాయని, అందుకే కొత్తగా సినిమాలు ఒప్పుకోలేదని చెప్తున్న సోనూసూద్ ఈ పాత్ర ను ఓకే చేయటంతో అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే మొదట ఓకే చేసిన సుదీప్ ఎందుకు రిజెక్టు చేసాడో మాత్రం తెలియరాలేదు. ఇక నవంబర్ రెండవ తేదీనుంచి ఈ చిత్రం హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ తో మొదలు కానుంది.ఇలియానా కూడా ఆ రోజునుంచి షూటింగ్ లో పాల్గొంటుంది. శక్తి చిత్రం విడుదలైన దగ్గరనుంచి కనపడకుండా పోయిన ఇలియానా ఇన్నాళ్లకు రీ ఎంట్రీ ఇవ్వనుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.గతంలో త్రివిక్రమ్ జల్సా చిత్రానికి సంగీతం అందించారు. అలాగే అల్లు అర్జున్ గత చిత్రాలకు దేవి సంగీతం బాగా ప్లస్ అయిన సంగతి తెలిసిందే.
ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. దీనికోసం ఇటీవల ముంబయిలోని హకీమ్స్ అలీమ్ అనే సెలూన్‌లో కొత్త రకం హెయిర్ స్టయిల్ చేయించుకున్నారు. ఈ లుక్ చాలా చాలా బాగుందని అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ అంటున్నారు. నాకైతే ఇప్పుడే అన్నయ్య ఫొటో విడుదల చేయాలని ఉంది. కానీ నా బ్రదర్ మాత్రం ఒకేసారి ఫస్ట్ లుక్ విడుదల చేద్దామంటున్నాడు. పోస్టర్‌లో డెరైక్ట్‌గా చూస్తేనే ప్రభావం ఉంటుందని తన అభిప్రాయం అని అల్లు శిరీష్ ట్విట్టర్‌లో పెట్టారు. అలాగే రీసెంట్ గా ఊసరవెల్లి చిత్రంతో పలకరించిన స్టైలిష్ దర్శకుడు సురేంద్రరెడ్డి తన తదుపరి చిత్రాన్ని అల్లు అర్జున్ తో చేయబోతున్నారు. ఆర్.ఆర్.మూవీమేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మించనున్న ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించనున్నారని సమాచారం. వచ్చే ఏడాది మార్చిలో ఈ చిత్రం చిత్రీకరణ మొదలు కానుందని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











