Sonu Sood: ఏపీ పాలిటిక్స్‌లోకి ఎంట్రీపై సోనుసూద్ షాకింగ్ కామెంట్స్.. చంద్రబాబు డైరెక్షన్‌లోనే అంటూ!
ఇండియాలో టాప్ యాక్టర్, సమాజ సేవకుడు సోను సూద్ మరోసారి పేద ప్రజల కోసం తనదైన శైలిలో స్పందించారు. ఆయన సోమవారం ఏపీ రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తన సేవా కార్యక్రమాల గురించి వివరించారు. ఏపీలోని ప్రజల కోసం అంబులెన్స్ సేవలు ప్రారంభిస్తున్నానని, అందుకు ప్రభుత్వ సహకారం కావాలని రిక్వెస్ట్ చేయగా సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. సీఎంతో భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ..
తెలుగు ప్రజలంటే నాకు చాలా ఇష్టం. నా హృదయంలో వారికి ఎప్పుడూ స్థానం ఉంటుంది. ఈ రోజు నా జీవితంలో స్పెషల్ డే. కొన్ని జిల్లాలో ఆరోగ్యపరమైన సేవలను అందించడానికి అంబులెన్సులను ప్రభుత్వానికి అందించడానికి వచ్చాను. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెడికల్ సౌకర్యాలు అందించాలన్నది నా లక్ష్యం. వారికి మెరుగైన చికిత్స, సదుపాయలు అందించాలనేది నా కృత నిశ్చయం అని సోను సూద్ అన్నారు.

ఆంధ్ర ప్రదేశ్ నాకు రెండో ఇల్లు. నా భార్య తెలుగు వారు. ఆ కారణంగానే ఆంధ్రా అంటే నాకు ఇష్టం. తెలుగు ప్రజలు నాకు చాలా ఇచ్చారు. దానికి బదులుగా కొంత తిరిగి ఇవ్వాలని అనుకొంటున్నాను. తెలుగు ప్రజలకు ఎలాంటి అవసరం వచ్చినా కేవలం ఫోన్ కాల్ దూరంలోనే ఉంటాను. ఎప్పుడూ మీ కోసం సేవలు అందించడానికి సిద్దంగా ఉంటాను అని సోను సూద్ తెలిపారు.
ఆంధ్రాలో సేవా కార్యక్రమం వెనుక ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు లేవు. కామన్ మ్యాన్‌గా ప్రజలకు సేవ చేయడమే. ఇప్పటికే గొప్ప నాయకులు గొప్ప కార్యక్రమాలు, సేవలు చేస్తున్నారు. చంద్రబాబు విజనరీ గొప్పది. నటుడిగా నేను భారీగా సంపాదిస్తున్నాను. అందులో కొంత ప్రజల కోసం ఖర్చు చేయాలని అనుకొంటున్నాను. కోవిడ్ నుంచి చంద్రబాబుతో రిలేషన్ ఏర్పడింది. ఆ బంధం కొనసాగుతూనే ఉంది. అందులో భాగంగానే ఆంధ్రాలో నాలుగు అంబులెన్స్ సేవలు ప్రారంభించాలని నిర్ణయించుకొన్నాను అని అన్నారు.
డబ్బు గురించి ఆలోచించను. ప్రజలకు ఏ విధంగా సహాయం చేస్తున్నామా? అనేది ఆలోచిస్తాను. పబ్లిక్ సర్వీస్ కేవలం ఓ ఎమోషన్. చిత్తూరు, ఏలూరు, నెల్లూరు జిల్లాలో అంబులెన్స్ సేవలు ప్రారంభమవుతాయి. అంబులెన్స్ సేవలు ఆంధ్రాతో మొదలుపెట్టాను. వీలైతే దేశం మొత్తం వ్యాప్తి చెందేలా ప్రయత్నిస్తాను. ఏపీకి బ్రాండ్ అంబాసిడర్ ఉండటానికి ఇష్టమే. తదుపరి పర్యటనలో పవన్ కల్యాణ్ గారిని కలుస్తాను అని సోనుసూద్ చెప్పారు.
సోనుసూద్‌తో మీటింగ్ తర్వాత చంద్రబాబు ట్వీట్ చేశారు. సోనుసూద్‌ను కలుసుకోవడం ఆనందంగా ఉంది. సోనుసూద్ ఫౌండేషన్ ద్వారా అంబులెన్సులను డొనేట్ చేసినందుకు థ్యాంక్స్. ప్రజల పట్ల మీ ప్రేమ కారణంగా అందరికి మెరుగైన ఆరోగ్యం అందుతుందని భావిస్తున్నాను. మీ జీవితంలో మరింత విజయం సాధించాలని కోరుకొంటున్నాను అని చంద్రబాబు తన ట్వీట్‌లో తెలిపారు.
It was a pleasure to meet you, @SonuSood! Thank you for the generous donation of ambulances to Andhra Pradesh through the @SoodFoundation. Your commendable initiative will strengthen healthcare services and ensure timely medical care in remote areas. Wishing you continued success… pic.twitter.com/HEzEudfAuT
— N Chandrababu Naidu (@ncbn) February 3, 2025


Click it and Unblock the Notifications











