twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    200 మంది ప్రభుత్వ విద్యార్థులకు స్మార్ట్ ఫోన్స్!!.. సోనూ సూద్ మంచితనానికి హద్దుల్లేవ్

    |

    కరోనా వైరస్ రావడం ఏంటో, లాక్‌డౌన్స్ ఏంటో ఇప్పుడున్న ఈ కష్ట కాలం ఎప్పుడు పోతుందో ఏమో గానీ ఇలాంటి క్లిష్ట సమయంలోనే ఎవరు ఎలాంటి వారన్న విషయం బయటకు వస్తుంది. ఇలాంటి విపత్తులు రాకపోయి ఉంటే సోనూ సూద్ గురించి ప్రపంచానికి తెలిసేది కాదు. సినిమాల్లో విలన్ వేషాలు వేసేవాడు అని అనుకునే వారు గానీ అతను రియల్ లైఫ్‌లో హీరో అని మాత్రం ఎవ్వరికీ తెలిసి ఉండేది కాదు. తాజాగా సోనూ సూద్ ఓ 200 మంది విద్యార్థులకు స్మార్ట్ ఫోన్‌లు కొనిచ్చాడు.

    Recommended Video

    Sonu Sood Donates Smart Phones To 200 Students సోనూ సూద్ మంచితనానికి హద్దుల్లేవ్ ! || Oneindia
    ఎన్ని చెప్పినా తక్కువే..

    ఎన్ని చెప్పినా తక్కువే..

    ఈ కరోనా కాలంలో సోనూ సూద్ చేసిన సాయాలు, సేవా కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎవరైతే ఆహారం, భోజనం లేకుండా పస్తులుంటున్నారని తెలిసిందో.. మరు క్షణం వారికి సదుపాయాలు కలిపించేవాడు. ట్రక్కుల నిండ భోజనాన్ని పంపించేవాడు. వలస కార్మికులను స్వగ్రామాలకు చేర్చాడు.

    ఏ రాష్ట్రంలో ఉన్నా..

    ఏ రాష్ట్రంలో ఉన్నా..

    ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా సరే సోనూ సూద్ కంట్లో పడితే, వారి బాధలు తెలిస్తే చాలు వారిని వెంటనే స్వగ్రామాలకు చేర్చేవాడు. అందుకోసం స్పెషల్ బస్‌లు, ఫ్లైట్స్ వేయించేవాడు. ఇలా సోనూ సూద్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇలా కేవలం స్వస్థలాలకు పంపించడమే కాదు వారికి జీవనోపాధి కల్పించేందుకు కూడా మార్గాలు సుగమం చేశాడు.

    ల్యాప్‌టాప్స్, మొబైల్స్..

    ల్యాప్‌టాప్స్, మొబైల్స్..


    ఇక సోనూసూద్‌ను ట్విట్టర్ వేదికగా ఏది కోరినా సరే ఇచ్చేవాడు. ఓ ఊర్లో ఓ అమ్మాయికి నెట్ వర్క్ లేదని కొండపైకి ఎక్కి చదువుకుంటోందని తెలిసి ఆ ఊరు మొత్తానికి నెట్ వర్క్ వచ్చేలా చేశాడు. ల్యాప్ టాప్స్, ఫోన్స్, బుక్స్ ఇలా ఎంతో మందికి ఎన్నో రకాలు సాయం చేశాడు. వైద్యం చేయించుకునే స్థోమత లేని వారికి వైద్యం చేయించాడు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ట్రాక్టర్ ఘటన ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే.

     200 మంది విద్యార్థులకు..

    200 మంది విద్యార్థులకు..

    తాజాగా ప్రభుత్వం ఆన్ లైన్ క్లాసులకు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. అయితే చంఢీఘడ్‌లో ఓ ప్రభుత్వ పాఠశాలలో 200 మంది విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు అటెండ్ కావడానికి ఫోన్స్ లేకపోవడంతో వారికి స్మార్ట్ ఫోన్లు పంపాడట. వారందరితోనూ సోనూ సూద్ వీడియో కాల్ మాట్లాడట. బాగా చదువుకోవాలని వారిని ప్రోత్సహించాడట. ఈ మేరకు కేట్టో సంస్థ చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.

    English summary
    Sonu Sood Donates 200 smart phone to Government students in chandigarh, Sonu Sood donated 200 smartphones to help class 9 to class 12 students of a government college in Chandigarh attend online classes amid the pandemic. He also video called the students to encourage them to study hard & achieve great heights.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X