twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sonu Sood పాలిటిక్స్‌లోకి.. పంజాబ్ ఎన్నికల వేళ సంచలన ప్రకటన.. రాజకీయాల్లో భారీ కుదుపు

    |

    నటుడిగానే కాకుండా సామాజిక కార్యకర్తగా, కరోనా కాలంలో ఎంతో మందిని ఆదుకొన్న మహనీయుడిగా ప్రశంసలు అందుకొన్న సోనుసూద్ మరో కొత్త అవతారంలో కనిపించనున్నారు. రాజకీయాల్లోకి ప్రవేశించందుకు ఆయన నిర్ణయం తీసుకొని సంచలన ప్రకటన చేశారు. ప్రజల సంక్షేమం కోసం పాటుపడేందుకు తాను సిద్ధమే అంటూ ఆయన ఓ ప్రకటనలో వెల్లడించారు. పంజాబ్ ఎన్నికల కోసం సిద్దమవుతున్నానని సోనుసూద్ తెలిపారు. ఇంతకు సోనుసూద్ ఏ పార్టీలోకి వెళ్తున్నారు. ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు అనే విషయాల్లోకి వెళితే..

    రెండేళ్లకుపైగా నిత్యం వార్తల్లో వ్యక్తిగా

    రెండేళ్లకుపైగా నిత్యం వార్తల్లో వ్యక్తిగా

    గత రెండేళ్లకుపైగా సోనూసూద్ ప్రతినిత్యం మీడియాలో వార్తల్లోని వ్యక్తిగా నిలిచారు. కరోనావైరస్ విపత్కర పరిస్థితుల్లో ధైర్యంగా ప్రజల జీవితాల్లో ఆశాదీపంగా నిలిచారు. దేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్న ఎంతో వలస కార్మికులను, ఉద్యోగులను, పేద ప్రజలకు అండగా నిలిచారు. లాక్‌డౌన్ విధిండచంతో తమ సొంత ఊర్లకు, తమ కుటుంబ సభ్యులకు దూరమైన వారిని వ్యయప్రయాసాలను లెక్క చేయకుండా కలిపారు.

    రాజకీయ ఉద్దండులతో సోనుసూద్ భేటి

    రాజకీయ ఉద్దండులతో సోనుసూద్ భేటి

    అయితే సోనూసూద్ సహాయం, సేవానీరతిని చూసి చాలా మంది ఆయన రాజకీయాల్లోకి రావాలంటూ తమ కోరికను బయటపెట్టారు. అయితే ప్రజల కోరికపై పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ అయితే ఇటీవల ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ, షిరోమణి అకాలీదళ్ నేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌ను ఇటీవల కలవడంతో రాజకీయాల్లో చేరడం ఖాయమనే ఊహగానాలు ఊపందుకొన్నాయి.

    సోనుసూద్ సంచలన ప్రకటన

    సోనుసూద్ సంచలన ప్రకటన

    ఇలాంటి ఊహాగానాల మధ్య ఆదివారం (నవంబర్ 14న) ఓ కీలక ప్రకటన చేశారు. తాను రాజకీయాల్లో చేరేందుకు సిద్దం. పంజాబ్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఏ పార్టీలోనైనా చేరడానికి రెడీగా ఉన్నాను. తన సోదరి మాల్విక సూద్ రాజకీయాల్లోకి ప్రవేశించి పోటీ చేస్తారని సోనూసూద్ చెప్పారు. తన సోదరికి అండగా నిలువాలని సోనుసూద్ ప్రజలను కోరారు. తనపై ఐటీ దాడులు చేయడం వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొన్నాను. నేను రైతులకు అండగా ఉంటాను. వారు పండించే పంట వల్లే మనమంతా ప్రతీ రోజు కడుపునిండా తింటున్నామని ఆయన ఎమోషనల్ అయ్యారు.

    స్వేచ్ఛ, స్వచ్ఛమైన పార్టీలో చేరేందుకు సిద్ధం

    స్వేచ్ఛ, స్వచ్ఛమైన పార్టీలో చేరేందుకు సిద్ధం

    పంజాబ్ రాజకీయాల్లో చేరేందుకు సిద్ధమే. పంజాబ్‌ ప్రజలకు విద్య, వైద్యాన్ని సంపూర్ణంగా అందించడానికి, ప్రజలకు మేలు చేయాలని తన కుటుంబం కోరుకొంటున్నది. అందుకే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకొన్నాను. ఇంకా ఏ పార్టీలో చేరాలనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రజల కోసం స్వేచ్ఛగా పనిచేయడానికి అవకాశం ఇచ్చే ఏ పార్టీలోనైనా చేరుతాను అని సోనుసూద్ పేర్కొన్నారు.

    Recommended Video

    SRC కి అండగా Sonu Sood..Shannu, Sunny కి కష్టమే | #BiggBossTelugu5 || Filmibeat Telugu
    పార్టీలు కాదు.. విధానాలు ముఖ్యం.. రైతన్నకు అండగా

    పార్టీలు కాదు.. విధానాలు ముఖ్యం.. రైతన్నకు అండగా

    అయితే స్వచ్ఛమైన, స్వేచ్చాయుతంగా అభిప్రాయాలను వెల్లడించే పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాను. కుమ్ములాటలు ఉండే పార్టీలకు దూరంగా ఉంటాను. స్వప్రయోజనాల కోసం సొంత పార్టీ నేతలను కించపరిచే పార్టీలో చేరను అని సోనూసూద్ తెలిపారు. తన సోదరి ఏ పార్టీలో చేరబోతుందనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. పార్టీలు ముఖ్యం కాదు. ప్రజా సంక్షేమం కోసం అమలు చేసే విధానాలే ముఖ్యం. నా సోదరి సేవచేయాలని అనుకొంటున్నది. పంజాబ్‌లో ఆప్, కాంగ్రెస్ పార్టీలు మంచి పార్టీలు అని సోనుసూద్ కితాబు ఇచ్చారు.

    English summary
    Actor and Social Worker Sonu Sood made a BIG announcement on joining politics ahead of Punjab Assembly elections. He said, His sister Malvika Sood will contest in Punjab Elections.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X