గర్ల్ ఫ్రెండ్ వద్దకు పంపించు భయ్యా.. సోనూసూద్‌కు నెటిజన్ అభ్యర్థన.. నటుడి అదిరిపోయే రిప్లై

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన సోనూ సూద్ పేరే వినిపిస్తోంది. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఎంతో మందికి అండగా నిలబడ్డాడు. ఎంతోమంది ఆకలి దప్పికలను తీర్చాడు. వైద్యులు,పోలీసులకు సాయం చేశాడు. వారు బస ఏర్పాటు చేసేందుకు ఆయన తన హోటల్‌ను విడిది కేంద్రంగా మార్చాడు. సినిమాల్లో మాత్రం విలన్ వేషాలు వేసే సోనూసూద్ తన సహాయ గుణంతో నిజమైన హీరో అనిపించుకుంటున్నాడు.

సోషల్ మీడియాలో సోనూ సూద్‌పై వెళ్లువెత్తుతున్న ప్రశంసలే దీనికి నిదర్శనం. అయితే అందులోనూ కొంతమంది ఆకతాయిలు ఉన్నారు. సాయం పేరిట మందు తెచ్చిపెట్టమని, గర్ల్‌ఫ్రెండ్ దగ్గరికి పంపించమని అభ్యర్థిస్తున్నారు. ఈ క్రమంలో సోనూ సూద్ వారికి అదిరిపోయే రిప్లైలు ఇస్తున్నారు.

సేవలో ముందు..

సేవలో ముందు..

కరోనా కష్టకాలంలో సోనూ సూద్ అందరికంటే ముందుంటున్నాడు. సామాన్య జనం, వలస కార్మికులు పడే కష్టాలను వింటున్నాడు. ఎక్కడ ఎవరికీ ఎలాంటి సాయం కావాలన్నా అందరి కంటే ముందు రియాక్ట్ అవుతున్నాడు. చేతనైన సాయం చేస్తున్నాడు.

ట్రక్ నిండా ఆహారం..

ట్రక్ నిండా ఆహారం..

రెండు మూడు దశల్లోని లాక్ డౌన్‌లో ఎంతో మంది ఆకలిని తీర్చాడు. వలస కార్మికుల పొట్ట నింపడానికి ట్రక్కుల నిండా ఆహారాన్ని తయారు చేయించి పంపేవాడు. వైద్య బృందానికి బస చేసేందుకు తన ఖరీదైన హోటల్‌ను విడిదిగా ఇచ్చేశాడు. రంజాన్ మాసంలో ముస్లింలకు కావాల్సిన డేట్స్, పళ్లను అందించాడు.

సురక్షితంగా ఇంటికి..

సురక్షితంగా ఇంటికి..

నాల్గో దశలోని సడలింపుల మేరకు వలస కార్మికుల తమ స్వగ్రామాలకు పంపే కార్యక్రమాన్ని చేపట్టాడు. ఎక్కడ ఎవ్వరూ అభ్వర్థించినా సరే.. వారి వివరాలు తెలుసుకుని తమ తమ గ్రామాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈ క్రమంలో కొంత మంది ఆకతాయిలు సోనూ సూద్‌కు పిచ్చి పిచ్చి అభ్యర్థనలు చేస్తున్నారు.

Recommended Video

Sonu Sood Snapped As He Steps Out With His Family For Ganpati Visarjan
మందు కావాలి, గర్ల్ ఫ్రెండ్ అంటూ..

మందు కావాలి, గర్ల్ ఫ్రెండ్ అంటూ..

మందు కావాలి గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి పంపించు భయ్యా అని రిక్వెస్ట్‌లు పెడుతున్నారు. సోనూ సూద్ కూడా వీటికి తనదైన శైలిలో సెటైర్స్ వేస్తున్నాడు. మందు తెచ్చిస్తాను కానీ అది అంతా అవసరమా? అని ప్రశ్నించాడు. ఇక గర్ల్ ఫ్రెండ్ దగ్గరకు పంపించమని అడిగిన వాడికి రిప్లై ఇస్తూ.. కొన్ని రోజులు దూరంగా ఉండి చూడండి, అదే స్వచ్చమైన ప్రేమకు పరీక్ష అని కౌంటర్ వేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X