twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సోనూ సూద్‌ సేవలను గుర్తించిన ఐరాస.. మంచి మనసుకు అసలైన గౌరవం!!

    |

    కరోనా వైరస్ భారతదేశాన్ని చుట్టుముట్టినప్పుడు దేశ ప్రజలెంతో మంది ఎన్నో రకాలు కష్టాలు పడ్డారు. ఎన్నో విధాలుగా అవస్థలు పడ్డారు. అయితే దేశ ప్రజల ఆకలి తీర్చేందుకు, వారి కష్టాలను పోగొట్టేందుకు సోనూ సూద్ ముందుకు వచ్చాడు. సోనూ సూద్ చేసిన సేవా కార్యక్రమాలు, సహాయ సహాకారాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దేశ మొత్తం సోనూసూద్ సేవాగుణాన్ని, దాతృత్వాన్ని కొనియాడింది. ఇప్పుడు అంతర్జాతీయ సంస్థ ఐరాస అనుబంధ సంస్థ కూడా గుర్తించింది.

    Recommended Video

    Sonu Sood Conferred With UNDP Award | Joins Priyanka Chopra, Angelina Jolie, Leonardo DiCaprio
    సోనూ సూద్ సేవలు, సాయాలు..

    సోనూ సూద్ సేవలు, సాయాలు..

    కరోనా లాంటి క్లిష్ట కాలంలో సోనూ సూద్ చేసిన సాయాలు, సేవా కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆకలితో అలమటించే వారికి భోజనాన్ని, ఉపాధి లేని వారికి ఉద్యోగాలను, చదువుకోవాలని కోరికగా ఉందంటే పుస్తకాలు, ఫీజలు ఇలా ఎన్నెన్నో చేశాడు. అందరి కోరికలను తీర్చాడు.

    వలస కార్మికులను అలా..

    వలస కార్మికులను అలా..

    లాక్ డౌన్ వల్ల వలస కార్మికులు పలు రాష్ట్రాల్లో చిక్కుకుపోయి అలమటిస్తుంటే.. వారిని స్వగ్రామాలకు చేర్చాడు. దాని కోసం బస్సులు, ఫ్లైట్‌లు కూడా ఏర్పాటు చేశాడు. స్వస్థలాలకు చేర్చడమే కాదు.. వారికి ఉద్యోగాలను కూడా చూపించి బతుకు దెరువును చూపించాడు.

    ట్విట్టర్‌లో కోరికలను..

    ట్విట్టర్‌లో కోరికలను..

    ఇక సోనూసూద్‌ను ట్విట్టర్ వేదికగా అందరి కోరకలను నెరవేర్చాడు. ఇందులో కొందరు అడిగితే సాయం చేయగా.. అడక్కపోయినా ఎంతో మందికి చేశాడు. ఎవరైనా ఏదైనా సమస్యతో బాధపడుతున్నాడని తెలిస్తే చాలు సాయం చేసిన ఘటనలెన్నో ఉన్నాయి. ఇలాంటి మంచి మనసున్న మనిషి గొప్పదనాన్ని అంతర్జాతీయ సంస్థ గుర్తించింది.

    అవార్డును ప్రకటించారు..

    అవార్డును ప్రకటించారు..

    ప్రముఖ నటుడు సోనూసూద్‌కు ఐక్యరాజ్య సమితి అవార్డు వరించింది. ఐరాస అనుబంధ సంస్థ యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ ఆయనకు ‘ఎస్‌డీజీ స్పెషల్‌ హ్యుమానిటేరియన్‌ అవార్డు'ను ప్రకటించింది. తద్వారా ఐరాస అవార్డును అందుకున్న యాంజెలినా జోలీ, డేవిడ్‌ బెక్‌హామ్‌, లియోనార్డో డి కాప్రియో, ప్రియాంకా చోప్రా తదితర సినీ ప్రముఖుల జాబితాలో సోనూ చేరారు.

    కొద్దిపాటి సహాయం..

    కొద్దిపాటి సహాయం..

    ఇది ఓ అరుదైన గౌరవం. ఐక్యరాజ్య సమితి గుర్తింపు పొందటం చాలా ప్రత్యేకం. నా దేశ ప్రజలకు నేను చేయగలిగిన కొద్దిపాటి సహాయాన్ని, నాకు వీలయిన విధంగా, ఏ ప్రయోజనం ఆశించకుండా చేశాను. అయితే నా చర్యలను గుర్తించి, అవార్డు అందించటం చాలా ఆనందంగా ఉంది అంటూ సోనూ సూద్ ఎమోషనల్ అయ్యాడు.

    English summary
    Sonu Sood Gets UNDP Appreciation, has been conferred with the prestigious SDG Special Humanitarian Action Award by the United Nations Development Programme
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X