twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగ్ 'భాయ్' షూటింగ్ లో ప్రమాదం

    By Srikanya
    |

    హైదరాబాద్ : నాగార్జున తాజా చిత్రం 'భాయ్' షూటింగ్ రీసెంట్ గా థాయ్ ల్యాండ్ లో మొదలైన సంగతి తెలిసిందే. అక్కడ షూటింగ్ లో ప్రమాదం జరిగిందని సమాచారం. ఈ ప్రమాదంలో సోనూ సూద్ కి గాయాలు అయినట్లు తెలుస్తోంది. అయితే పెద్ద పెద్ద గాయాలేమీ జరగలేదని, రికవరి అవుతున్నారని తెలుస్తోంది. అందిన సమాచారం ప్రకారం...నో మ్యాన్స్ ల్యాండ్ అనే ప్రాంతంలో షూటింగ్ జరుగుతోంది. సముద్రం ఒడ్డుకి ఆ లొకేషన్ కి బోట్ లో వస్తూంటే... పెద్ద కెరటం ఢీ కొని ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు పడవ మునిగిపోయే సిట్యువేషన్ లో సేవ్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలుసుకున్నాక ఆయన భార్య,పిల్లలు వెంటనే సోనూసూద ని చూడటానికి అక్కడకి వెళ్లారు.

    నాగార్జున కొత్త చిత్రం 'భాయ్' చిత్రం జనవరి నాలుగు నుంచి షూటింగ్ మొదలైంది. కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందే ఈ చిత్రంలోలీడర్, మిరపకాయ్ చిత్రాల ఫేం రీచా గంగోపాధ్యాయ్ హీరోయిన్ గా చేస్తోంది. సోనూసూద్ మెయిన్ విలన్ గా కీ రోల్ లో కనిపించనున్నారు. నాగార్జున స్వయంగా తమ అన్నపూర్ణ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రామ జోగయ్య శాస్త్రి టైటిల్ సాంగ్ రాసారు. అహ నా పెళ్లంట, పూలరంగడు వంటి హిట్ చిత్రాలను రూపొందించిన వీరభద్రం చౌదరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

    నాగార్జున ఈ చిత్రం గురించి మాట్లాడుతూ....భాయ్ చిత్రం సీరియస్‌గా వుండే దావుద్ ఇబ్రహీం లాంటి కథ అని భావిస్తున్నారని, కానీ పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ చిత్రం ఉంటుందని ఆయన వివరించారు. అలాగే'భాయ్' పేరుతో వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి నిజమే, కాని అది మాఫియా నేపథ్యం కాదు. 'హలో బ్రదర్' సినిమా తరహాలో పూర్తి వినోదాత్మకంగా వుంటుంది. ఇందులో నా పాత్ర 'కింగ్'లో బొట్టు శ్రీనులా వినోదాన్ని పంచుతుంది అన్నారు.

    దర్శకుడు వీరభద్రమ్ చౌదరి చిత్ర విశేషాలు తెలియజేస్తూ 'రెండున్నర గంటలు కడుపుబ్బా నవ్వించే చక్కటి హాస్య చిత్రమిది. 'హలో బ్రదర్' తరహాలో నాగార్జున పాత్ర చిత్రణ వుంటుంది. ఇందులో నాగార్జున మాఫియా డాన్ పాత్రను చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. అసలు మాఫియా అనే అంశమే ఈ చిత్రంలో వుండదు. నాగార్జున సంభాషణలు, మేనరిజమ్స్ సరికొత్త పంథాలో వుంటాయి. ఆయన అభిమానుల్ని అలరించే అంశాలన్నీ 'భాయ్'లో వున్నాయి' అన్నారు.

    అలాగే నాగార్జున కూడా 'భాయ్' సబ్జెక్ట్ పట్ల చాలా సంతోషంగా వున్నారని, తన కెరీర్‌లో వైవిధ్యమైన హాస్య చిత్రం చేయబోతున్నానని ఆయన ప్రశంసించినట్లు వీరభవూదమ్ తెలిపారు. 'హాలో బ్రదర్' తరహాలో సినిమా వుంటుంది కానీ నాగార్జున ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేయడం లేదని ఆయన అన్నారు. రిచాగంగోపాధ్యాయ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవీశ్రీ ప్రసాద్.

    English summary
    Actor Sonu Sood met with an accident while shooting for the forthcoming movie of Hero Nagarjuna’s ‘Bhai’ in Thailand however he did not suffer any major injuries and is recovering well. Sonu, while he was returning to the shore at No man’s land location as a part of shooting, his boat was hit by high tide which left the boat almost capsized however he was safe now. His wife and children are flown to Bangkok to stay with him.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X