»   » మన దేశం, మన నటులతో చైనీస్ సినిమా: చిరుత హీరోయిన్ ఆస్కార్ బరి లో

మన దేశం, మన నటులతో చైనీస్ సినిమా: చిరుత హీరోయిన్ ఆస్కార్ బరి లో

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ ఏడాది ఆస్కార్ రేసులో నిలిచిన చైనా సినిమా 'జువాన్ జాంగ్ " (Xuanzang). ఇది చైనీస్ మూవీనే అయినా.. దాదాపుగా ఇండియా నేపథ్యంతోనే సాగుతుంది. గతంలో రెండు సార్లు ఆస్కార్ కోసం ప్రయత్నించి ఫెయిల్ అయిన చైనీస్ సినిమా లోకం.. ఇప్పుడుజువాన్ జాంగ్ " (Xuanzang)తో ఆస్కార్ దక్కుతుందని ఆశలు పెట్టుకుంది. చైనా లాంటి దేశం ఇండియా నేపథ్యంతో సినిమాతో ఆస్కార్ దక్కించుకోవాలని ప్రయత్నించడం ఆశ్చర్యమే అయినా.. ఈ మూవీ స్టోరీ అలా ఉంటుంది.

చిరుత సినిమాతో టాలీవుడ్ పరిచయం అయిన సుందరి నేహా శర్మ. ఈ అమ్మడు చిరుత తర్వాత బాలీవుడ్‌లో పాగా వేసింది. ప్రస్తుతం అక్కడ వరుసగా కొన్ని సినిమాలు చేసి మంచి గుర్తింపే తెచ్చుకుంది. అటువంటి నేహా శర్మ నటించిన ఓ చైనీస్ మూవీ ఇప్పుడు ఆస్కార్ బరిలో నిలవడం ఇంట్రెస్టింగ్ టాపిక్ అయింది. బాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే ఇటీవల హిందీలో కూడా రిలీజైన 'జువాన్ జాంగ్ " (Xuanzang)' అనే ఓ చైనీస్ మూవీలో నేహా శర్మ హీరోయిన్ గా నటించింది. ఈమె మాత్రమే కాదు మన బాలీవుడ్ హీరో, విలన్ అయిన సోనూసూద్ కూడా ఈ సినిమాలో చక్రవర్తి గా కనిపిస్తాడు. ఇంతకీ ఈ సినిమాలో అంత మ్యాటర్ ఏముందీ... మన దేశానికీ చైనాకీ ఉన్న సంబందం ఈ సిన్మాలో నటులేనా.. అంటే...

బౌద్ధ సన్యాసి జీవితమే:

బౌద్ధ సన్యాసి జీవితమే:

ఏడో శతాబ్దానికి చెందిన జువాన్ జాంగ్ అనే బౌద్ధ సన్యాసి జీవితమే ఈ మూవీ. టాంగులు చైనాను ఏలుతున్న కాలంలో.. కన్ఫ్యూషియస్ మతం విస్తృతంగా ఉన్న తరుణంలో.. బౌద్ధానికి సంబంధించి మరింతగా రీసెర్చ్ చేసేందుకు ఇండియా వచ్చిన సన్యాసి జువాన్ జాంగ్. 17 ఏళ్ల వయసులోనే సన్యాసం స్వీకరించిన ఈయన. 16 ఏళ్ల పాటు ఇండియాలోనే ఉండి.. బౌద్ధమతం గురించి తెలుసుకుని..

ఎన్నో కీలక పదవులు:

ఎన్నో కీలక పదవులు:

తర్వాత చైనా భాషలోకి అనువదిస్తాడు. ఎన్నో కీలక పదవులు కాలి దగ్గరకు వచ్చినా.. బౌద్ధానికే జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు జాన్ జాంగ్.ఆ కాలంలో ఆ గురువు ప్రయాణానికి 17 ఏళ్ళు పట్టగా.. అప్పటి విజువల్స్ ను ఇప్పటి సినిమాలో మేకర్స్ అద్భుతంగా చూపించారని సమాచారం. అలాగే ‘జువాన్ జాంగ్ " (Xuanzang)' కథాకథనాలు కూడా ఆకట్టుకోవడంతో ఈ ఏడాది రిలీజ్ అయిన చైనీస్ పిక్చర్స్ అన్నింటి కంటే ఎక్కువగా మంచి ఆదరణతో పాటు ప్రశంసలు కూడా దక్కించుకుంది.

ఆస్కార్ దక్కే అర్హత:

ఆస్కార్ దక్కే అర్హత:

ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సినిమాను ఆస్కార్ పోటీకి కూడా ఎంపిక చేశారు. బెస్ట్ ఫారిన్ ఫిలిం కేటగిరీలో ఈ ‘జువాన్ జాంగ్ " (Xuanzang)' ఆస్కార్ బరిలో పోటీ పడనుంది. ప్రస్తుతం ఈ ‘జువాన్ జాంగ్ " (Xuanzang)' కు ఆస్కార్ దక్కే అర్హత ఎక్కువగానే ఉందనే వాదన గట్టిగానే వినిపిస్తుంది. ఇకపోతే, ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నేహా శర్మ మెరవడమే కాకుండా మన సోనూసూద్ కూడా ఓ కీలక పాత్ర పోషించడం విశేషం. మరి నిజంగా ఈ సినిమాను ఆస్కార్ వరిస్తే అప్పుడు మన చెర్రీ హీరోయిన్, సోనూసూద్ ల ఆనందానికి హద్దే లేకుండా పోతుందేమో. అప్పుడు అది మనకు కూడా ఆనందమే అనుకోండి.

చైనాలో వీలుకాదని :

చైనాలో వీలుకాదని :

చైనాను టాంగులు ఏలుతున్న కాలం. చైనాలో ఎక్కువ శాతం కన్‌ఫ్యూషియన్‌ మతాచారాల్ని పాటిస్తున్న ఆ సమయంలో తన 13వ ఏటనే బౌద్ధం స్వీకరించాడు " జాంగ్ " ఆ మతం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి చైనాలో వీలుకాదని తెలుసుకొని భారతదేశానికి రావడానికి సిద్ధపడ్డాడు. అలా 17వ ఏటనే బౌద్ధ సన్యాసిగా చైనా నుంచి భారతదేశంలోకి అడుగుపెట్టాడు. 16 ఏళ్లపాటు మన దేశంలో వివిధ ప్రాంతాల్లో పర్యటించి బౌద్ధం గురించి తెలుసుకొని తిరిగి స్వదేశానికి వెళ్లిపోయారు.

సూత్రాలు, పవిత్ర గ్రంథాలను:

సూత్రాలు, పవిత్ర గ్రంథాలను:

అక్కడికెళ్లాక ఆయనకు ఘన స్వాగతం లభించింది. పెద్దపెద్ద పదవులు కాళ్లముందుకు వచ్చాయి. అయినా ఆయన తన జీవితం బౌద్ధం కోసమే అని అంకితమైపోయారు. ఆయన మన దేశంలో ఉన్న రోజుల్లో సంస్కృతంలో ఉన్న బౌద్ధ మతానికి సంబంధించిన సూత్రాలు, పవిత్ర గ్రంథాలను చైనా భాషలోకి అనువదించారు. చైనా నుంచి భారతదేశం వరకు సాగిన ఆ యాత్రలో ఆయన సంపాదించిన జ్ఞాన సంపద, కనుగొన్న విషయాలు అపూర్వమని చరిత్రకారులు, పురాతత్వ శాస్త్రవేత్తలు చెబుతుంటారు.

సోనూ సూద్‌ హర్షవర్థనుడిగా:

సోనూ సూద్‌ హర్షవర్థనుడిగా:

ఈ పర్యటనలో ఆయన అమరావతి, నాగార్జున కొండ ప్రాంతాల్లో కొన్నాళ్లు ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. ఆయన జీవితమే ఈ సినిమా కథ. సినిమాతో జాన్‌ జాంగ్‌గా హుయాంగ్‌ జియోమింగ్‌ నటించాడు. ఈ సినిమాలో సోనూ సూద్‌ హర్షవర్థన్‌ అనే రాజుగా నటించారు. ఆయనతోపాటు నేహా శర్మ, మందనా కరిమి కీలక పాత్రల్లో కనిపించారు. వీరే కాకుండా మరో 15 మంది దాకా భారతీయ నటులు ఈ సినిమాలో ఉన్నారు.

ఆస్కార్‌ వెళ్తొంది:

ఆస్కార్‌ వెళ్తొంది:

ఈ సినిమాని మన దేశంలో నాగాలాండ్‌, అజంతా, ఎల్లోరా, నలంద, ముంబయి ప్రాంతాల్లో చిత్రీకరించారు. దీంతోపాటు భారత్‌, చైనా సరిహద్దుల్లోనూ వివిధ ప్రాంతాల్లో చిత్రీకరణ సాగింది. సినిమాకు తొలుత ఓ మోస్తరు స్పందన వచ్చింది. అయితే చైనా ప్రభుత్వం చేసిన ప్రచారం మూలంగా సినిమాకు వూహించని రీతిలో వసూళ్లు పెరిగాయి. ఇప్పుడు ప్రభుత్వ చొరవతోనే ఆస్కార్‌ వెళ్తొంది.

ఆస్కార్‌ పురస్కారం కోసం:

ఆస్కార్‌ పురస్కారం కోసం:

గతంలోనూ విదేశీ చిత్ర విభాగంలో ఆస్కార్‌ పురస్కారం కోసం చైనా రెండుసార్లు తమ సినిమాను బరిలో నిలిపింది. ఆ రెండు సార్లు నిరాశే మిగిలింది. దీంతో జువాన్ జాంగ్'పై ఆసక్తి నెలకొంది. గత నెల 31న కాలిఫోర్నియాలో జరిగిన రెండో వార్షిక ఆసియన్‌ ప్రపంచ చలనచిత్రోత్సవంలో ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు.

అమితాబ్‌ బచ్చన్‌:

అమితాబ్‌ బచ్చన్‌:

ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర కోసం అమితాబ్‌ బచ్చన్‌ను సంప్రదించినట్లు వార్తలొచ్చాయి. అయితే ఇది కార్యరూపం దాల్చలేదు. జువాన్ జాంగ్ నలందను సందర్శించినప్పుడు మొత్తం భారతదేశ పర్యటన విశేషాలు, విషయాలను ఓ డైరీలో రాశారు. అది సినిమాకు బాగా ఉపయోగపడిందని చిత్ర దర్శకుడు హువో జియాన్‌క్వి చెప్పారు.

చైనా ప్రభుత్వం చొరవ:

చైనా ప్రభుత్వం చొరవ:

హర్షవర్ధనుడుగా సోనూ సూద్ నటించగా.. నేహాశర్మ.. మందనా కరిమి సహా 15మంది ఇండియన్ యాక్టర్స్ ఈ సినిమాలో నటించారు. మన దేశంలోనూ అజంతా.. ఎల్లోరా.. నలంద సహా పలు ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహించారు. జువాన్ జాంగ్ ను ఆస్కార్ బరిలో నిలపడంలో చైనా ప్రభుత్వం చొరవ తీసుకోగా.. అప్పట్లో అమితాబ్ ను ఓ కీలక పాత్రలో నటింపచేసేందుకు ప్రయత్నించినా.. సాధ్యం కాలేదు.

English summary
The Chinese historical adventure film Xuanzang has been selected as China's official entry for the 89th Academy Awards. Interestingly, the film stars Indian actors Sonu Sood, Ali Fazal and Neha Sharma in pivotal roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu