అఘోరాని ఎదుర్కోవటానికే రామ్ చరణ్ పాట్లు
రామ్ చరణ్,సంపత్ నంది కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రంలో విలన్ గా అరుంధతిలో అఘోరా గా చేసిన సోనూసూద్ ని ఎంపిక చేసారు.దాంతో రామ్ చరణ్ వెండితెరపై తన కన్నా ఎత్తు,సిక్స్ పాక్ బాడీతో ఉన్న అతన్ని ఎదుర్కోవటానకి శారీరకంగా ప్రిపేర్ అవుతున్నాడు.త్వరలో ప్రారంభం కానున్న ఈ కొత్త చిత్రం కోసం చరణ్ అమెరికాలో డేవిడ్ బార్టన్స్ జిమ్‌లో కఠోరమైన వ్యాయామాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.తన పుట్టిన రోజు వేడుకను నిరాడంబరంగా అక్కడే జరుపుకున్నాడు.చరణ్ రీసెంట్ చిత్రం 'ఆరెంజ్' ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకోవటంతో నాలుగో సినిమాపై తన దృష్టి సారించారు. మాస్‌ని మెప్పించడమే ధ్యేయంగా కథలు ఎంచుకొంటున్నారు. 'ఏమైంది ఈ వేళ' సినిమాతో బాక్సాఫీసు దగ్గర విజయం అందుకొన్న దర్శకుడు సంపత్ నంది ఈ కథను యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించాడని చెప్తున్నారు.మరోవైపు వి.వి.వినాయక్ కూడా చరణ్ కోసం ఓ కథ సిద్ధం చేశారు.ఈ చిత్రాలు తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఓ చిత్రం ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications











