శ్రుతిహాసన్ కి అన్నగా సోనూసూద్
తెలుగులో వచ్చిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' సినిమాకి రీమేక్‌గా హిందీలో 'రామయ్యా వస్తావయ్యా' రూపొందుతోంది. ఇక్కడ శ్రీహరి పోషించిన పాత్రలోనే అక్కడ సోనూ సూద్ నటించారు. నిర్మాత కుమార్ తరౌనీ తనయుడు గిరీష్ కుమార్ ఈ సినిమాతో బాలీవుడ్‌లో పరిచయం అవుతున్నారు. సోనూసూద్ ఇటీవలే ఈ సినిమాకు డబ్బింగ్ కూడా చెప్పారు. ''సినిమా చాలా బాగా వచ్చింది. ప్రభుదేవా బాగా తెరకెక్కించారు''అని ఆయన ట్విట్టర్‌లో వ్యాఖ్య రాశారు.
ఇప్పటికే హిందీలో 'లక్' చిత్రంలో నటించింది శ్రుతి. ప్రస్తుతం 'రామయ్యా వస్తావయా'లో నటిస్తోంది. నువ్వు వస్తానంటే నే వద్దంటానా రీమేక్ 'రామయ్యా వస్తావయా'. ప్రభుదేవా ఆ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నాడు. ఆమె తర్వాతి హిందీ చిత్రమిదే అంటున్నాయి సన్నిహిత వర్గాలు.
'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'... త్రిషకు టాలీవుడ్‌లో తిరుగులేని ఇమేజ్ తెచ్చిన చిత్రం. ఇప్పుడీ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు ప్రభుదేవా. హీరోయిన్‌గా సమంతను ఫిక్స్ చేశారు. అయితే అనారోగ్య కారణాల వల్ల సమంత ఈ సినిమా నుంచి తప్పుకుంది. 'గబ్బర్‌సింగ్' సక్సెస్‌తో క్లౌడ్ నైన్‌లో ఉన్న శ్రుతిహాసన్ దోసిట్లోకి వాలిపోయింది ఈ ప్రాజెక్ట్...
దర్శకుడుగా ప్రభుదేవా తొలి చిత్రం 'నువ్వొస్తానంటే నే నొద్దంటానా'. హీరోగా సిద్ధార్థ్, హీరోయిన్‌గా త్రిషకు సూపర్ ఇమేజ్‌ని తీసుకువచ్చిన సినిమా ఇది.ప్రముఖ నిర్మాత రమేశ్ తౌరానీ కుమారుడు గిరీష్‌ని హీరోగా ఎంపిక చేశాడు ప్రభుదేవా. హీరోయిన్‌గా సమంతను ఫిక్స్ చేశారు. అయితే అనారోగ్య కారణాల వల్ల సమంత తప్పుకోవడంతో ఆ లక్కీ ఛాన్స్ ఇప్పుడు శ్రుతిహాసన్‌కి దక్కింది.


Click it and Unblock the Notifications












