For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సోనూసూద్ కాలిగాయానికి 3 గంటలు ఆపరేషన్ (ఫోటో)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : నటుడు సోనూసూద్ ఇటీవల(శనివారం) దుబాయ్‌లో సెల్రబిటీ క్రికెట్ లీగ్‌లో ఆడుతూ గాయపడ్డ సంగతి తెలిసిందే. అతని కుడి కాలుకు బలమైన గాయం(ఫ్యాక్చర్) అయింది. దీంతో వెంటనే అతన్ని దుబాయ్ లోని లోకల్ ఆసుపత్రికి తరలించి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్ మెంట్ చేయించారు.

    మేజర్ సర్జరీ అవసరం అని అక్కడి వైద్యులు చెప్పడంతో వెంటనే అతన్ని ముంబైలోని కోకిలాబెన్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. సోమవారం వైద్యులు అతనికి 3 గంటలకుపైగా శస్త్ర చికిత్స నిర్వహించారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో వైద్యులు 190 నిమిషాల పాటు శ్రమించాల్సి వచ్చింది.

    మొత్తం అతని కాలులో 6 చోట్ల ఫ్యాక్చర్ అయినట్లు వైద్యులు వెల్లడించారు. అదే విధంగా అతనికి భవిష్యత్ లో కూడా మరో మైనర్ సర్జరీ చేయాల్సి రావచ్చని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సోనూ సూద్ మరో రెండు నెలల వరకు పూర్తిగా బెడ్ రెస్టులోనే ఉండాలలని, ఆ తర్వాత షూటింగుల్లో పాల్గొనడం లాంటి చేయాలని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

    నొప్పి నుంచి ఇప్పుడిప్పుడు కోలుకుంటున్న సోనూసూద్ తన కాలికి గాయమైన ఫోటోను తన ట్విట్టర్లో పోస్టు చేసాడు. ఈ గాయం కారణంగా సోనూసూద్ రామ్ చరణ్ 'జంజీర్' చిత్రం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. సోనూ సూద్ స్థానంలో తెలుగు నటుడు శ్రీహరిని ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

    English summary
    
 Actor Sonu Sood, who suffered an ill-fated accident while playing for the Celebrity Cricket League in Dubai, had to posted his fractured leg photo on his twitter account.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X