»   » చివరకు విలన్ తో సెటిలైన చార్మి

చివరకు విలన్ తో సెటిలైన చార్మి

Posted By:
Subscribe to Filmibeat Telugu

బుడ్డా చిత్రంతో హిందీలో అడుగుపెట్టిన చార్మికి అక్కడ ఓ గాడ్ ఫాదర్ అవసరమయ్యారు. ఆ స్లాట్ లోకి సోనూ సూద్ వచ్చి చేరాడు. అతను ఆమెను అక్కడ ప్రమోట్ చేస్తున్నాడు. తనకు తెలిసి ఉన్న హీరోలకు, నిర్మాతలకు, దర్శకులకు ఆమెను పరిచయం చేస్తున్నాడు. చార్మి కూడా ముంబైలో ఉన్నంత సేపూ అతనితోనే ఉండటానకి ఇష్టపడుతోంది. ఇక బుడ్డా సమయంలోనే వారి ఇద్దరికి బాగా దగ్గర రిలేషన్ ఏర్పడింది. ఆమెకు అక్కడ ఎలా ఎవరితో మెలగాలనే విషయంలోనూ గైడన్స్ ఇస్తున్నాడని ముంబై వర్గాల చెప్తున్నాయి. పూరీ జగన్నాధ్ తో ముంబైకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ అతను ది బిజినెస్ మ్యాన్ చిత్రంలో బిజీగా ఉండిపోవటంతో ఇలా సోనూ సూద్ తో సెటిలైంది. ఇక ప్రస్తుతం చార్మికి తెలుగులో చిత్రాలు ఏమీ లేవు. శ్రీకాంత్ తో ప్రారంభించిన చిత్రం ఆగిపోయింది. దాంతో తెలుగుపై కాన్సర్టేషన్ తగ్గించి బాలీవుడ్ లో సెటిల్ అవ్వాలని ఆమె నిర్ణయించుకుంది.

English summary
Sonu Sood is helping his 'Buddha' co star Charmi to get work in Bollywood.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu