తట్టుకోలేకపోయా..నటన మానేద్దామనుకున్నా:సోనూ సూద్

తన తొలి అవకాసం గురించి చెప్తూ... నాకు మొదటి అవకాశం తమిళంలో వచ్చింది. కొత్త హీరోయిన్లను వెతుకుతూ ముంబయికి వచ్చిన క్యాస్టింగ్ డైరెక్టర్‌కు నా ఫొటోను ఇచ్చా. అయిష్టంగానే తీసుకున్నాడు. చాలారోజులు తన ఆఫీసు బల్ల సొరుగులో పడేశారట. ఒకరోజు ఆ సినిమా దర్శకుడు చూసి, నాకు ఫోన్ చేశారు. వెళ్లాక అవకాశం ఇచ్చారు. వెంటనే అమ్మకు ఫోను కలిపా. వారం తరవాత కొరియర్ వచ్చింది. దాన్లో తమిళం నేర్చుకునే పుస్తకాలు ఉన్నాయి. 'భాష తెలిస్తేనే బాగా చేయగలవు, ప్రయత్నించు' ఒక పుస్తకంలో అమ్మ రాసిన మాటలు. ఆ తరవాత వెనుతిరిగి చూసింది లేదు.
తెలుగులో హ్యాండ్సప్, సూపర్.. వరుసగా అవకాశాలొచ్చాయి. 'అరుంధతి'లోని నా పాత్ర గురించి చెప్పి, అమ్మకి ఫొటోలను చూపించా. 'ఇది నీకు టర్నింగ్ పాయింట్ అవుతుందిరా..' అంది. అదే నిజమైంది. అవకాశాల 'దూకుడు' పెరిగింది. అమ్మ నా సినిమాలూ, విజయాలూ చూసి సంతోషపడింది. కానీ ఎప్పుడూ ఏం కోరుకోలేదు. తను ముంబయి వస్తే, నేను కారులో వచ్చి తీసుకెళ్లాలని ఆశపడింది. అలాగే చేశా. చాలా సంతోషపడింది. 'జోధా అక్బర్'లో ఐశ్వర్యరాయ్‌కి అన్నగా చేస్తున్నప్పుడు అమ్మని సెట్స్‌కి తీసుకెళ్లా అన్నారు.
ఒక మగాడి విజయం వెనుక.. స్త్రీ తప్పకుండా ఉంటుందంటారు.. నా విషయంలో ఆ స్త్రీమూర్తి ఎవరో కాదు.. అమ్మే అంటాడు సోనూసూద్. అరుంధతిలో 'వదల బొమ్మాళీ..' అంటూ తెలుగు ప్రేక్షకుల అభినందనలు అందుకున్నా.. ఇతర సినిమాల్లోనూ విలన్ గా కనిపించి విజయం సాధించినా.. ఆ గెలుపుని అమ్మకే అంకితం చేస్తానంటాడతను. సాధారణ అబ్బాయి నుంచి సినిమా రంగంలోకి అడుగుపెట్టే వరకూ తన మాతృమూర్తి అడుగడుగునా అండగా నిలిచిన తీరు గురించి సోనూ సూద్ ఇలా పంచుకున్నాడు.


Click it and Unblock the Notifications











