twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తట్టుకోలేకపోయా..నటన మానేద్దామనుకున్నా:సోనూ సూద్

    By Srikanya
    |

    Sonu Sood
    హైదరాబాద్ : మరో కొద్ది రోజుల్లో చెల్లెలి పెళ్లి. నేను వూరికి బయలుదేరుతున్నా. అప్పుడు ఫోన్‌. 'అమ్మ చనిపోయింది' అని. తట్టుకోలేకపోయా. నటించడం మానేద్దాం అనుకున్నా. నాన్న వూరడించారు. 'నువ్వలా చేస్తే, అమ్మ సంతోషించదు' అన్నారు. అందుకే అమ్మ పేరు మీద ట్రస్టు ప్రారంభించి, పేద విద్యార్థులకు సాయం చేస్తున్నా. ఈ రోజున నాకు అన్నీ ఉన్నాయి.. అమ్మ తప్ప అంటూ తన తల్లి తో తనకు ఉన్న ఎటాచ్ మెంట్ గురించి వివరించారు ప్రముఖ క్యారెక్టర్ నటుడు, విలన్ గా ఎన్నో సినిమాలకు కీలకమైన నిలిచిన సోనూ సూద్.

    తన తొలి అవకాసం గురించి చెప్తూ... నాకు మొదటి అవకాశం తమిళంలో వచ్చింది. కొత్త హీరోయిన్లను వెతుకుతూ ముంబయికి వచ్చిన క్యాస్టింగ్‌ డైరెక్టర్‌కు నా ఫొటోను ఇచ్చా. అయిష్టంగానే తీసుకున్నాడు. చాలారోజులు తన ఆఫీసు బల్ల సొరుగులో పడేశారట. ఒకరోజు ఆ సినిమా దర్శకుడు చూసి, నాకు ఫోన్‌ చేశారు. వెళ్లాక అవకాశం ఇచ్చారు. వెంటనే అమ్మకు ఫోను కలిపా. వారం తరవాత కొరియర్‌ వచ్చింది. దాన్లో తమిళం నేర్చుకునే పుస్తకాలు ఉన్నాయి. 'భాష తెలిస్తేనే బాగా చేయగలవు, ప్రయత్నించు' ఒక పుస్తకంలో అమ్మ రాసిన మాటలు. ఆ తరవాత వెనుతిరిగి చూసింది లేదు.

    తెలుగులో హ్యాండ్సప్‌, సూపర్‌.. వరుసగా అవకాశాలొచ్చాయి. 'అరుంధతి'లోని నా పాత్ర గురించి చెప్పి, అమ్మకి ఫొటోలను చూపించా. 'ఇది నీకు టర్నింగ్‌ పాయింట్‌ అవుతుందిరా..' అంది. అదే నిజమైంది. అవకాశాల 'దూకుడు' పెరిగింది. అమ్మ నా సినిమాలూ, విజయాలూ చూసి సంతోషపడింది. కానీ ఎప్పుడూ ఏం కోరుకోలేదు. తను ముంబయి వస్తే, నేను కారులో వచ్చి తీసుకెళ్లాలని ఆశపడింది. అలాగే చేశా. చాలా సంతోషపడింది. 'జోధా అక్బర్‌'లో ఐశ్వర్యరాయ్‌కి అన్నగా చేస్తున్నప్పుడు అమ్మని సెట్స్‌కి తీసుకెళ్లా అన్నారు.

    ఒక మగాడి విజయం వెనుక.. స్త్రీ తప్పకుండా ఉంటుందంటారు.. నా విషయంలో ఆ స్త్రీమూర్తి ఎవరో కాదు.. అమ్మే అంటాడు సోనూసూద్‌. అరుంధతిలో 'వదల బొమ్మాళీ..' అంటూ తెలుగు ప్రేక్షకుల అభినందనలు అందుకున్నా.. ఇతర సినిమాల్లోనూ విలన్ గా కనిపించి విజయం సాధించినా.. ఆ గెలుపుని అమ్మకే అంకితం చేస్తానంటాడతను. సాధారణ అబ్బాయి నుంచి సినిమా రంగంలోకి అడుగుపెట్టే వరకూ తన మాతృమూర్తి అడుగడుగునా అండగా నిలిచిన తీరు గురించి సోనూ సూద్ ఇలా పంచుకున్నాడు.

    English summary
    'It was 4 months before the release of JODHAA AKBAR that I lost my mom. After that SINGH IS KINNG came. In fact on the 'chautha' of my mother's death, I got a call from Rajshris who offered me the solo lead role for EK VIAAH AISA BHI. This was a clear signal from my mother who always wanted to see me successful. It's just magical. I want to give all the credit for where I am today to my mother', adds Sonu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X