twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ ని రిజెక్ట్ చేసిన సోనూ..!

    By Sindhu
    |

    సల్మాన్ ఖాన్ నటించిన 'దబాంగ్" లో సోనూసూద్ విలన్ గా నటించాడు. కాగా 'దబాంగ్-2" సోనూసూద్ ని విలన్ గా తీసుకోవాలని అనుకున్నాడు. అందుకని ఈ సినిమా ప్రారంభించేలోపు విలన్ గా వేరే చిత్రాల్లో నటించకూడదని సోనూసూద్ కు సల్మాన్ ఓ కండీషన్ పెట్టాడని సమాచారం. తాజగా పవన్ కళ్యాణ్ హీరోగా 'దబాంగ్" తెలుగులో 'గబ్బర్ సింగ్" పేరిట రీమేక్ అవుతోన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో కూడా సోనూసూద్ ని విలన్ గా నటింపజేయాలని పవన్ భావిస్తున్నాడట. అందుకని సల్మాన్ దగ్గర సోనూసూద్ ని 'గబ్బర్ సింగ్" లో విలన్ గా నటించడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా పవన్ కళ్యాణ్ అడిగాట. స్వయంగా పవన్ కళ్యాణ్ అడగడంతో సల్మాన్ అంగీకరించాడని..సో గబ్బర్ సింగ్ విలన్ సోనూసూద్ అని అప్పట్లో వార్తలు వచ్చాయి

    అయితే ప్రస్తుతం విలన్ గా బిజీగా ఉన్న వాళ్లల్లో సోనూ సూద్ ఒకరు. హిందీ 'దబాంగ్" లో సోనూ సూద్ కనబర్చిన విలనిజానికి మంచి మార్కులు పడ్డాయి. ఇదే చిత్రం తమిళ రీమేక్ 'ఓస్తి"లో హీరో శింబు కూడా సోనూయే విలన్. ఇదిలా ఉంటే మిరపకాయ్ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్ హీరోగా నటించనున్న విషయం తెలిసిందే. ఇందులో సోనూ సూద్ ని విలన్ గా ఎన్నుకున్నారని సమాచారం. కానీ చేసిన పాత్రనే మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు చేయాలనే ఉద్దేశ్యంతో 'గబ్బర్ సింగ్"ని కాదన్నాడని సమాచారం. ఈ చిత్రంలో పవన్ కి ఎవర్ విలన్ అవుతారో వేచి చూడాల్సిందే...

    English summary
    Sonu Sood has made it to the top list of negative leads in Tollywood in a short while and the actor has always tried to prove his mettle by essaying distinct roles as comic villain, menacing villain, sadistic villain et al. The latest reports reveal that Sonu Sood has rejected the negative lead role in Pawan Kalyan’s next flick Gabbar Singh.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X