twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వాటిని ప్రచురించకండి.. దండం పెడ్తాను.. సుశాంత్‌ను ప్రశాంతంగా వెళ్లనివ్వండన్న సోనూసూద్

    |

    ఎవరైనా సెలెబ్రిటీలు మరణించారంటే.. అది కచ్చితంగా సెన్సేషన్ అవుతుంది. అందులోనూ ఆత్మహత్య, హత్యలు జరిగితే ఇంకెంత సెన్సేషన్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక మీడియా కళ్లన్నీ అటువైపే తిరుగుతాయి. అయితే ఈ క్రమంలో కొందరు మాత్రం హద్దులు దాటుతుంటారు. ఎక్స్‌క్లూజివ్ పేరిటి ఫోటోలను, వీడియోలను ప్రచురిస్తారు. విగత జీవిగా పడి ఉన్న సదరు సెలెబ్రిటీ ఫోటోలను షేర్ చేస్తూ నానా రచ్చ చేస్తుంటారు. తాజాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ విషయంలోనూ అదే జరిగింది. అయితే వీటిపై కొందరు సెలెబ్రిటీలు ఆవేదన చెందుతున్నారు.

    సుశాంత్ ఆత్మహత్య..

    సుశాంత్ ఆత్మహత్య..

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (34) ఆదివారం ముంబైలోని తన నివాసంలో ఉరి వేసుకుని మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన కారణాలేవీ ఇంకా బయటకు రాలేదు. కానీ డిప్రెషన్, ఆర్థిక కారణాల వల్లే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారని అందరూ కామెంట్స్ చేస్తున్నారు.

     చివరి ఫోటోలు వైరల్..

    చివరి ఫోటోలు వైరల్..

    అయితే సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్న ఫోటోలు, చివరగా పోలీసులు తీసిన ఫోటోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఆ ఫోటోలు చూస్తే మరింత కుంగిపోయేలా చేస్తోంది. సుశాంత్ చివరి ఫోటోలను మీడియా ప్రచురించడంపైనా కొందరు సెలెబ్రిటీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

    వేడుకున్న కుష్బూ..

    వేడుకున్న కుష్బూ..

    ‘సుశాంత్ చివరి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దయచేసి మనం ఇలా ప్రవర్తించొద్దు. ఆయన ప్రైవసీ, కుటుంబాన్ని, అభిమానులను గౌరవించండి. చివరి క్షణాలకు సంబంధించిన ఫోటోలను ప్రచురించడానికి ఇది సరైన సమయం కాదు.. కొంచెం మానవత్వం, జాలిని చూపించండ'ని కుష్బూ వేడుకుంది.

    Recommended Video

    Music Composer Wajid Khan Of Sajid-Wajid Passes Away Due To COVID-19
    ప్రశాంతంగా వెళ్లనివ్వండి..

    ప్రశాంతంగా వెళ్లనివ్వండి..

    ‘మనం ఈ రోజు ఓ మిత్రుడిని, సహచరుడిని కోల్పోయాం. ఇది భరించలేని నష్టం. ఈ విషయాన్ని, ఆయన చివరి ఫోటోలను షేర్ చేసి సెన్సేషనల్ చేయకండని మీడియా మిత్రులను కోరకుంటున్నాను. ఓ బాలుడు ఎన్నో ఆశలతో సిటీకి వచ్చారు.. ఎంతో ఎత్తుకు ఎదిగాడు.. ఇలా మనల్ని వదిలి వెళ్లిపోయాడు. ఆయన్ని ప్రశాంతంగా వెళ్లనివ్వండ'ని సోనూసూద్ దండం పెట్టాడు.

    English summary
    Sonu Sood Request Media To Not Share Sushant Last pics. Today we lost a friend, a colleague & this loss is irreparable.I request my friends from the media not to sensationalise this,I request everyone not to share images.A boy who came to this city with dreams in his eyes and achieved so much has left us forever.Let him go in peace
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X