twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sonu Soodకి షాక్.. కార్ సీజ్.. హౌస్ అరెస్ట్.. అసలు ఏమైందంటే?

    |

    పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో నటుడు సోనూసూద్‌పై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించింది. అంతే కాక సోనూసూద్ కారును కూడా స్వాధీనం చేసుకుంది. అనంతరం ఎన్నికల అధికారులు సోనూసూద్‌ను ఇంటికి తరలించి ఇంటి నుంచి బయటికి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అసలు ఎందుకు సోనూ సూద్ కారు స్వాధీనం చేసుకున్నారు? ఎందుకు ఇంట్లో నిర్బంధించారు? అనే వివరాల్లోకి వెళితే

    Recommended Video

    Punjab Elections 2022: Sonu Sood stopped from visiting polling booths in Punjab's Moga Constituency
     పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు

    పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు


    పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ఆదివారం ఓటింగ్ జరుగుతోంది. రాష్ట్రంలోని మొత్తం 117 స్థానాలకు ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ జరుగుతోంది. నటుడు సోనూసూద్ సోదరి కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సోనూసూద్ తన సోదరి ఎన్నికల దృష్ట్యా ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న 'మోగా'లోని వివిధ పోలింగ్ బూత్‌లకు వెళ్తున్నాడు. అయితే అలా తిరగడాన్ని ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఆయన కారు సీజ్ చేయడమే కాక ఇంటికి తరలించి ఇంటి నుంచి బయటికి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

    ఎవరినీ అడగడం లేదు

    ఎవరినీ అడగడం లేదు


    సోనూసూద్ ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ శిరోమణి అకాలీదళ్ తరపున ఫిర్యాదు దాఖలైంది. ఫిర్యాదు అందిన క్రమంలో ఎన్నికల సంఘం నటుడు సోనూసూద్‌ను ఏ పోలింగ్ బూత్‌లోకి ప్రవేశించకుండా అడ్డుకుంది. అంతేకాదు అన్ని బూత్ లకు వెళుతోన్న ఆయన కారును కూడా జప్తు చేసింది. అయితే ఈ ఆరోపణలను సోనూసూద్ ఖండించారు. తన సోదరి మాళవికా సూద్‌కు ఓటు వేయమని తాను ఎవరినీ అడగడం లేదని అన్నారు. తాను పోలింగ్ కేంద్రాల వెలుపల ఉన్న కాంగ్రెస్ బూత్‌లను మాత్రమే సందర్శిస్తున్నట్లు తెలిపారు.

    చర్యలు తీసుకుంటా

    చర్యలు తీసుకుంటా

    మొత్తం కేసు నివేదికను ఎస్‌ఎస్‌పీ నుంచి పిలిపించామని డిప్యూటీ కమిషనర్‌ హరీష్‌ నాయర్‌ తెలిపారు. ఈ విషయంలో అధికార యంత్రాంగం ఆరోపణలు నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆదివారం ఉదయం నుంచి సానూసూద్, అతని సోదరి మాళవిక సూద్ ప్రతి బూత్ వద్ద ఓటర్లను కలుస్తుండటం గమనార్హం. మెగా స్థానం నుంచి మాళవిక పోటీ చేస్తున్నారు. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి హర్జిత్ కమల్ మీద మాళవిక పోటీలో ఉన్నారు.

    బహుముఖ పోటీ

    బహుముఖ పోటీ


    ఇక తన మీద ఫిర్యాదు చేసిన వారి మీద సోనూసూద్ తీవ్ర ఆరోపణలు చేశారు. నటుడు మాట్లాడుతూ, "చాలా మంది ప్రజలను అకాలీదళ్ వారు భయపెడుతున్నారు. పలు బూత్‌లలో డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఎన్నికలు జరిగినప్పుడు పారదర్శకంగా ఎన్నికలు జరగాలి. ఎస్‌ఎస్పీ సాహెబ్‌కు ఫిర్యాదు చేశాను. మా కారు సీజ్ చేశారు అందుకే ఇంకో కారులో వచ్చామని సోనూ వెల్లడించారు.

    బహుముఖ పోటీ

    బహుముఖ పోటీ

    మోగా జిల్లా PRO ప్రభదీప్ సింగ్ మాట్లాడుతూ, "సోనూ సూద్ పోలింగ్ బూత్ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ సందర్భంగా ఆయన కారును సీజ్ చేసి ఇంటికి పంపించారు. ఇంటి నుంచి బయటకు వస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. అని అన్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 117 స్థానాల్లో 2.14 కోట్ల మంది ఓటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో 93 మంది మహిళా అభ్యర్థులు సహా 1304 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఈసారి పంజాబ్‌లో కాంగ్రెస్, ఆప్, ఎస్‌ఎడి-బిఎస్‌పి కూటమి, బిజెపి-పిఎల్‌సి-ఎస్‌ఎడి (యునైటెడ్) మరియు వివిధ రైతు సంఘాల రాజకీయ విభాగమైన సంయుక్త సమాజ్ మోర్చా మధ్య బహుముఖ పోటీ ఉంది.

    English summary
    Sonu Sood's car seized and police sent home from Punjab's Moga
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X