twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బంజారా హిల్స్‌లో జ్యూస్ షాప్‌లో సోనుసూద్.. చిరు వ్యాపారికి అండగా.. పళ్ల రసం తీసి..

    |

    లాక్ డౌన్ కష్టకాలంలో రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్ అంతకంతకు జనాలకు దగ్గరావుతున్నారు. వెండితెరపై విలన్ పాత్రలు చేసిన ఆ నటుడి గుండెల్లో ఇంత మంచితనం ఉంటుందని ఎవరు ఊహించలేదు. సహాయం కోసం వచ్చిన ప్రతి మనిషికి ఏదో ఒక విధంగా తన మద్దతు ఇస్తున్నారు. ఇక ఇటీవల రోడ్డు పక్కన ఉన్న ఒక చిన్నపాటి వ్యాపారికి సైతం ఉచితంగా ప్రమోషన్ చేసి శభాష్ అనిపించుకున్నారు.

    Recommended Video

    Sonu Sood Making Orange Juice At Hyderabad, Video Goes Viral | Oneindia Telugu
    సొంత డబ్బుతో సహాయం చేసి

    సొంత డబ్బుతో సహాయం చేసి

    ఈ రోజుల్లో స్టార్ హోదా అనేది ఒక బిజినెస్ అయిపోయింది. అయితే వాళ్ళు తలచుకుంటే చాలామందికి ఎలాగైనా సహాయం చేయవచ్చు. ఒక స్టార్ తలచుకుంటే రోజుకి ఒక జీవితాన్ని నిలబెట్టవచ్చు అని చాలామంది నిరూపిస్తున్నారు. ఇక సోనూసూద్ కూడా ముందు తన సొంత డబ్బుతో సహాయం చేసి ఆ తరువాత ఇతరులను కూడా అందులో భాగం చేశాడు.

    చిన్నపాటి వ్యాపారుల కోసం..

    చిన్నపాటి వ్యాపారుల కోసం..

    సోనూసూద్ కు ప్రపంచవ్యాప్తంగా విరాళాలు అందుతున్నాయి. అతను ఎలాంటి సహాయం చేసినా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక స్టార్ హోదాను జనాల కోసం ఉపయోగిస్తున్న సోనూసూద్ చిన్నపాటి వ్యాపారుల కోసం కూడా తనవంతు సహాయం చేస్తున్నాడు. ఇటీవల ఒక జ్యూస్ బండి వద్దకు సింపుల్ గా వెళ్లి ప్రమోట్ చేశారు.

    సొంతంగా జ్యూస్ తయారు చేసుకున్న సోనూసూద్

    సొంతంగా జ్యూస్ తయారు చేసుకున్న సోనూసూద్

    హైదరాబాద్ తనకు సెకండ్ హోమ్ అని చెప్పిన సోనూసూద్ గతంలో ఒక చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కు వెళ్లి దానికి మంచి క్రేజ్ వచ్చేలా చేశాడు. సోనూసూద్ బ్రాండ్ ఆ వ్యాపారికి బాగా హెల్ప్ అయ్యింది. ఇక ఇటీవల బంజారాహిల్స్ లోని రోడ్ నెంబర్ 2లో ఒక ఫ్రూట్ జ్యూస్ బండి దగ్గరకు వెళ్లి సొంతంగా మొసంబి రసాన్ని తయారు చేసుకొని అతనికి సపోర్ట్ చేశాడు. ఈ జ్యూస్ లో సీ విట‌మిన్ ఉంటుంద‌ని చెబుతూ దీనిని ఎక్కువ‌గా తీసుకుంటూ చిరు వ్యాపారుల‌ని ప్రోత్సహించాల‌ని వివరణ ఇచ్చారు.

    ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా..

    ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా..

    సాధారణంగా స్టార్స్ పెద్ద వ్యాపారాల ప్రమోషన్ కోసం భారీగా ఫీజు తీసుకుంటారు. అయితే సోనూసూద్ మాత్రం ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా అలాంటి చిన్న వ్యాపారులకు కూడా మద్దతు ఇవ్వండి అని ప్రమోషన్ చేశాడు. ఇక ఇటీవల హైదరాబాద్ లో ఒక ఖరీదైన ఫ్లాట్ ను కొనుగోలు చేసిన ఈ నటుడు టాలీవుడ్ సినిమాలతో బిజీగా మారారు. నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

    English summary
    Sonu Sood supports small business by making and having Mosambi juice at banjara hills road no.2, Hyderabad,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X