Don't Miss!
- News అచ్చెన్నాయుడు ప్రత్యర్ధికి ఊరట-పోటీ నుంచి తప్పుకున్న భార్య..!
- Sports ప్రశాంతంగా ఉన్నా.. ఇక చాలు- నరైన్ షాకింగ్ కామెంట్స్
- Technology Android 15 Features ఆండ్రాయిడ్ 15 లో క్వారంటైన్ ఫీచర్.. ఎలా పనిచేస్తుంది.. ఏంటి ఉపయోగం..??
- Finance Amit Shah: ఆ కంపెనీల్లో అమిత్ షా పెట్టుబడులు.. హోం మంత్రి పోర్ట్‌ఫోలియోలో టాప్-10 స్టాక్స్ ఇవే
- Lifestyle వీర్య కణాల సంఖ్య ఫాస్ట్‌గా పెరగాలంటే ఇవి వెంటనే తినండి..!
- Automobiles మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
బంజారా హిల్స్‌లో జ్యూస్ షాప్‌లో సోనుసూద్.. చిరు వ్యాపారికి అండగా.. పళ్ల రసం తీసి..
లాక్ డౌన్ కష్టకాలంలో రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్ అంతకంతకు జనాలకు దగ్గరావుతున్నారు. వెండితెరపై విలన్ పాత్రలు చేసిన ఆ నటుడి గుండెల్లో ఇంత మంచితనం ఉంటుందని ఎవరు ఊహించలేదు. సహాయం కోసం వచ్చిన ప్రతి మనిషికి ఏదో ఒక విధంగా తన మద్దతు ఇస్తున్నారు. ఇక ఇటీవల రోడ్డు పక్కన ఉన్న ఒక చిన్నపాటి వ్యాపారికి సైతం ఉచితంగా ప్రమోషన్ చేసి శభాష్ అనిపించుకున్నారు.
Recommended Video
సొంత డబ్బుతో సహాయం చేసి
ఈ రోజుల్లో స్టార్ హోదా అనేది ఒక బిజినెస్ అయిపోయింది. అయితే వాళ్ళు తలచుకుంటే చాలామందికి ఎలాగైనా సహాయం చేయవచ్చు. ఒక స్టార్ తలచుకుంటే రోజుకి ఒక జీవితాన్ని నిలబెట్టవచ్చు అని చాలామంది నిరూపిస్తున్నారు. ఇక సోనూసూద్ కూడా ముందు తన సొంత డబ్బుతో సహాయం చేసి ఆ తరువాత ఇతరులను కూడా అందులో భాగం చేశాడు.
చిన్నపాటి వ్యాపారుల కోసం..
సోనూసూద్ కు ప్రపంచవ్యాప్తంగా విరాళాలు అందుతున్నాయి. అతను ఎలాంటి సహాయం చేసినా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక స్టార్ హోదాను జనాల కోసం ఉపయోగిస్తున్న సోనూసూద్ చిన్నపాటి వ్యాపారుల కోసం కూడా తనవంతు సహాయం చేస్తున్నాడు. ఇటీవల ఒక జ్యూస్ బండి వద్దకు సింపుల్ గా వెళ్లి ప్రమోట్ చేశారు.
సొంతంగా జ్యూస్ తయారు చేసుకున్న సోనూసూద్
హైదరాబాద్ తనకు సెకండ్ హోమ్ అని చెప్పిన సోనూసూద్ గతంలో ఒక చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కు వెళ్లి దానికి మంచి క్రేజ్ వచ్చేలా చేశాడు. సోనూసూద్ బ్రాండ్ ఆ వ్యాపారికి బాగా హెల్ప్ అయ్యింది. ఇక ఇటీవల బంజారాహిల్స్ లోని రోడ్ నెంబర్ 2లో ఒక ఫ్రూట్ జ్యూస్ బండి దగ్గరకు వెళ్లి సొంతంగా మొసంబి రసాన్ని తయారు చేసుకొని అతనికి సపోర్ట్ చేశాడు. ఈ జ్యూస్ లో సీ విటమిన్ ఉంటుందని చెబుతూ దీనిని ఎక్కువగా తీసుకుంటూ చిరు వ్యాపారులని ప్రోత్సహించాలని వివరణ ఇచ్చారు.
ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా..
సాధారణంగా స్టార్స్ పెద్ద వ్యాపారాల ప్రమోషన్ కోసం భారీగా ఫీజు తీసుకుంటారు. అయితే సోనూసూద్ మాత్రం ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా అలాంటి చిన్న వ్యాపారులకు కూడా మద్దతు ఇవ్వండి అని ప్రమోషన్ చేశాడు. ఇక ఇటీవల హైదరాబాద్ లో ఒక ఖరీదైన ఫ్లాట్ ను కొనుగోలు చేసిన ఈ నటుడు టాలీవుడ్ సినిమాలతో బిజీగా మారారు. నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.