Don't Miss!
- Sports T20 World Cup: ఆ కుర్రాడికి టికెట్ కన్ఫార్మ్- సెహ్వాగ్
- Finance Railway News: రైలు ప్రయాణికులకు శుభవార్త..! టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలు తగ్గింపు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- News Ys Jagan Attack case: జగన్ పై రాయి దాడి కేసులో మరో కీలక పరిణామం..!
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
విషమంగానే శివ శంకర్ ఆరోగ్యం.. నేనున్నానన్న సోనూ సూద్.. ఆ హీరో కూడా రంగంలోకి?
ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్న సంగతి తెలిసిందే. కరోనా సోకడంతో గత ఐదు రోజులుగా ఆయన హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన చికిత్స కోసం రోజుకు లక్ష రూపాయలు అవుతూ ఉండడంతో కుటుంబ సభ్యులు మొత్తం కోసం ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్ నుంచి ఏదైనా సహాయం దొరుకుతుందేమో అని ఎదురుచూస్తున్న వాళ్లకు సోనూసూద్ రూపంలో ఒక భారీ దొరికినట్లైంది. వివరాల్లోకి వెళితే
కరోనా సోకడంతో
కరోనా సోకిన తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురైన శివ శంకర్ మాస్టర్ ను పరీక్షించిన వైద్యులు 75 శాతం ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ సోకినట్లు వెల్లడించారు. శివ శంకర్ మాస్టర్ పెద్ద కొడుక్కి కూడా కరోనా సోకి అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు వైద్యులు తెలిపారు. కరోనా సోకడంతో శివ శంకర్ మాస్టర్ భార్య హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. ఆయన చిన్న కొడుకు అజయ్ కృష్ణ ఒక్కడే ప్రస్తుతం తండ్రి, అన్న, అమ్మ బాగోగులు చూసుకుంటూ ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో తండ్రి వైద్యానికి చాలా ఖర్చవుతోందని అంత మొత్తాన్ని వెచ్చించే పరిస్థితుల్లో లేమని అజయ్ బాధ పడుతున్నారు.
ఆ కుటుంబానికి అండగా
దీంతో సోషల్ మీడియాలో ఆ కుటుంబానికి సాయం చేయాలంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే సాయం అంటే నేనున్నా అని ముందు ఉండే సోనూ సూద్ తానున్నానంటూ అభయహస్తం ఇచ్చారు. " ఇప్పటికే శివ శంకర్ మాస్టర్ ఫ్యామిలీ తో టచ్ లో ఉన్నా.
వారిని కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. ఆందోళన అవసరం లేదు" అంటూ సోనూసూద్ ట్వీట్ చేశారు.
|
నేనున్నానని సోనూ సూద్
సోనూ సూద్ శివశంకర్ కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఆయన ప్రాణాలు రక్షించేందుకు అన్నివిధాలుగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా కూడా వెల్లడించాడు. కొరియోగ్రఫర్ గా శివశంకర్ 80వ దశకం నుంచి వివిధ భాషలకి చెందిన సినిమాలకి ఆయన సేవలు అందించారు. తెలుగు, తమిళ భాషల్లోని ఎన్నో సినిమాలకి ఆయన డాన్స్ మాస్టర్ గా పనిచేశారు. అలాగే ఎంతో మంది స్టార్ హీరోలకు ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ కి ఆయన కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు.
అవార్డులు
ఆయన తన కెరీర్ లో నాలుగు సార్లు తమిళ నాడు స్టేట్ అవార్డు అందుకున్నారు. అలాగే రామ్ చరణ్ మగధీర సినిమాలో ధీర.. ధీర.. ధీర.. పాటకుగానూ 2011లో ఆయనకు జాతీయ పురస్కారం కూడా లభించింది. డ్యాన్స్ మాస్టర్ గానే కాకు చాలా సినిమాల్లో ఆయన నటుడిగానూ అలరించారు. అంతేకాకుండా బుల్లితెరపై ప్రసారమైన డ్యాన్స్ షోలకు జడ్జ్గానూ వ్యవహరించారు.
Recommended Video
ధనుష్ కూడా
అయితే తమిళ హీరో ధనుష్ కూడా శివ శంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారని సమాచారం. ఆయనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని అవసరమైన సహాయం నేను చేస్తానని ఆయన మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే సోనూసూద్ తాను అండగా ఉంటాను అనే విషయాన్ని నేరుగా పంచుకున్నా సరే ధనుష్ విషయం మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు.