twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏ ఒక్క ప్రాణం పోవద్దు.. సోనుసూద్ మరోసారి మానవత్వం.. విదేశాల నుంచి ప్లాంట్స్ దిగుమతి!

    |

    ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కరోనావైరస్ విజృంభణం చెక్ పెట్టే విధంగా నటుడు సోనుసూద్ విశేషంగా కృషి చేస్తున్నారు. ఓ వైపు బాధితులకు ఆపన్న హస్తం అందిస్తూనే ప్రజలకు ఏ రూపంలో సేవల చేయాలనే ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. అయితే కరోనావైరస్ సెకండ్ వేవ్‌లో మరింత ప్రమాద పరిస్థితులు ముంచుకు రావడం, అలాగే దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఉండటంతో సోనూసూద్ మరోసారి సాహోసోపేతమైన నిర్ణయం తీసుకొన్నారు.

    ఆక్సిజన్ కొరత కారణంగా

    ఆక్సిజన్ కొరత కారణంగా

    ఆక్సిజన్ కొరత కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోవద్దనే ఆలోచనతో ఫ్రాన్స్, ఇతర దేశాల నుంచి నాలుగు ఎక్సిజన్ ప్లాంట్స్ దిగుమతి చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. ఇందుకు భారత్‌లోని పలు రాష్ట్రాల్లో మౌళిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని ప్రణాళికను సిద్ధం చేసుకొన్నారు.

    థర్డ్ వేవ్‌లో ఎలాంటి కష్టాలు లేకుండా

    థర్డ్ వేవ్‌లో ఎలాంటి కష్టాలు లేకుండా

    కరోనావైరస్ సెకండ్ వేవ్ ఎంతటి భీకరమైన పరిస్థితులను కళ్లముందు కదలాడుతున్న సమయంలో సోనుసూద్ మరోసారి తన మానవత్వాన్ని ప్రదర్శించారు. థర్ట్ వేవ్‌లో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ముందస్తు ప్రణాళినకు సోనుసూద్ సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.

    సెకండ్ వేవ్‌లో దారుణంగా

    సెకండ్ వేవ్‌లో దారుణంగా

    సెకండ్ వేవ్‌లో దారుణమైన పరిస్థితులు నెలకొన్న మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఈ ప్లాంట్ల ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. ఆ తర్వాత మిగితా రాష్ట్రాల్లో వాటిని స్థాపించేందుకు చర్యలు తీసుకొంటున్నారు. కోవిడ్ పేషంట్లకు సహాయం అందించేలా సోనుసూద్ ప్రయత్నాలు చేస్తున్నారు. అక్టోబర్ నుంచి థర్డ్ వేవ్ మొదలయ్యే అవకాశం ఉందనే హెచ్చరికల నేపథ్యంలో సోనుసూద్ తన ప్రణాళికను సిద్ధం చేసుకొంటున్నట్టు సమాచారం. మే 20వ తేదీలోపు ఈ ప్లాంట్ల నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకొంటున్నారు.

    Recommended Video

    Sonu Sood To Import Oxygen Plant From France | ఇంకో పది రోజుల్లో వస్తుంది || Filmibeat Telugu
    ఆక్సిజన్ కొరత ఉండొద్దు.. సోనుసూద్

    ఆక్సిజన్ కొరత ఉండొద్దు.. సోనుసూద్

    ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుపై సోనుసూద్ స్పందించారు. చాలా మంది పేషంట్లు ఆక్సిజన్ లేక సతమతమవుతున్నారు. తాను ఏర్పాటు చేసే ఆక్సిజన్ ప్లాంట్స్ వల్ల హాస్పిటల్స్‌కు సరఫరా చేయడమే కాకుండా సిలండర్లను నింపి అందించే విధంగా ప్లాన్స్ చేస్తున్నాం. కోవిడ్ పేషంట్లకు ఆక్సిజన్ అందించే విధంగా ప్రధానంగా ఏర్పాట్లు చేస్తాం అని సోనుసూద్ పేర్కొన్నారు.

    English summary
    Bollywood actor Sonu Sood to import Oxygen plants from France and other Countries to serve the coronavirus patient.He is planning to establish plants in Maharastra, Karnataka, Kerala.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X