V సినిమా చూడాలట.. హెల్ప్ చేయమన్న నెటిజన్‌కు సోనూ సూద్ కౌంటర్
ప్రస్తుతం దేశంలో సూపర్ హీరో అని ఎవరినైనా అడిగితే అందరూ చెప్పే ఏకైక పేరు సోనూసూద్. లాక్డౌన్‌లో ఎందరికో అన్నం పెట్టి, ఇంకెందరో వలస కార్మికులను స్వగృహాలకు చేర్చి, ఎక్కడో చిక్కుకపోయిన వారిని తమ తమ కుటుంబాలకు దగ్గరకు చేర్చి ప్రజల గుండెల్లో దేవుడిగా ఎదిగాడు. ఎవరికి ఏ అవసరం వచ్చినా కొడుకులా, తండ్రిలా, అన్నలా క్షణాల్లో సాయం చేస్తున్నాడు. ఫోన్లు అడిగితే ఫోన్లు, ఉపాధి కల్పించడం కోసం ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయడం ఇలా ఒకటా రెండా చెప్పుకుంటే పోతే సోనూ సూద్ సాయాల చిట్టా ఎప్పటికీ పూర్తి కాదు.
ఓ వైపు సోనూ సూద్ ఇలా ఎంతో సీరియస్‌గా సాయం చేసే పనిలో ఉంటే కొందరు మాత్రం ఆటపట్టించే పనిలో పడ్డారు. కొందరు నెటిజన్స్ కావాలని ఫన్ క్రియేట్ చేసేలా ట్వీట్స్ చేస్తున్నారు. ఒకరేమో మందు కావాలని, ఇంకొకరు లవర్ దగ్గరి పంపండి అంటూ, మరొకరు వీడియో గేమ్ ఆడుకోడానికి ఫోన్ కావాలని అడుగుతున్నారు. అయితే వీటికి కూడా సోనూ సూద్ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు.

ఇక తాజాగా సోనూ సూద్ ఓ నెటిజన్‌కు ఇచ్చిన రిప్లై అదుర్స్. v సినిమా చూడాలి ఓ అమెజాన్ ప్రైమ్ అకౌంట్ కావాలి, డీటైల్స్ పంపు అన్న అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దీనికి స్పందించిన సోనూ సూద్.. అది సరిపోతుందా బ్రదర్ లేదా ఓ టీవీ, ఏసీ, పాప్ కార్న్ కూడా పంపాలా? అంటూ కౌంటర్ వేశాడు. ఇక దెబ్బకు సదరు నెటిజన్ తన ట్వీట్‌ను డిలీట్ చేసేశాడు. ఇలా సోనూ సూద్ ఎవరికి కావాల్సింది వారికి ఇచ్చేస్తూ దేశ ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకుంటున్నాడు.



Click it and Unblock the Notifications











