'బ్రదర్ పూరీ జగన్నాద్' అంటూ సోనూసూద్
మహేష్ బాబు,పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో రూపొందుతున్న బిజినెస్ మ్యాన్ చిత్రం ఆడియో ఈ రోజు విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పూరీ జగన్నాధ్ చిత్రాల్లో విలన్ గా చేసి పాపులర్ అయిన సోనూ సూద్ తాజాగా ఓ ట్వీట్ చేసారు. ఆయన ట్వీట్ లో...విషెష్ టు మై బ్రదర్ పూరీ జగన్ ఫిల్మ్ బిజినెస్ మ్యాన్. ఈ రోజు ఆ చిత్రం ఆడియో విడుదల అవుతోంది. నేను ఖచ్చితంగా చెప్తున్నాను..అది భాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టిస్తుందని అంటూ ట్వీట్ చేసారు.బిజినెస్ మ్యాన్' ఆడియో రిలీజ్ ఈ రోజు(డిసెంబర్ 22) సాయంత్రం గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
ఈ భారీ ఈవెంట్ కు శిల్పకళా వేదిక వేదికైంది. ఈ వేడుకు మహేష్ బాబుతో పాటు ఎంటైర్ యూనిట్ సభ్యలు హాజరు కానున్నారు. అంతేకాకుండా పలువురు టాలీవుడ్ బిగ్ షాట్స్ కు కూడా ఆహ్వానం పంపించారు. మహేష్ బాబు సినీ కెరీర్ లోనే ఇదో భారీ బిగ్గెస్ట్ ఆడియో ఈవెంట్ గా నిలిచే విధంగా జోరుగా ఏర్పాట్లు చేస్తున్నారు. అభిమానులు వేల సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉన్నందున వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేడుక జరిగే సందర్భంగా ట్రాఫిక్ జామ్స్ లాంటివి ఏర్పడకుండా అటు పోలీసులు కూడా ముందస్తు ఏర్పాట్లతో సిద్ధం అయ్యారు.ఈ చిత్రాన్ని ఆర్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై డా.వెంకట్ నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. దూకుడు సినిమాకు సూపర్ హిట్ మ్యూజిక్ అందించిన తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











