»   » నటి, మాజీ మిస్ ఇండియాకు ఫోన్ వేధింపులు.. అసభ్య వీడియోలు..

నటి, మాజీ మిస్ ఇండియాకు ఫోన్ వేధింపులు.. అసభ్య వీడియోలు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్‌లో నిన్నటి తరం నటి, మిస్ ఇండియా సోనువాలియాకు ఫోన్‌లో లైంగిక వేధింపులు తప్పలేదు. గుర్తు తెలియన వ్యక్తి ఒకరు ఫోన్‌లో అసభ్య పదజాలంతో దూషించారని, అశ్లీల వీడియోలను ఆమెకు పంపించి వేధించినట్టు సోనువాలియా తెలిపారు. ఈ మేరకు ఆమె ముంబైలోని బంగూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

వారం రోజులుగా తనకు అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి వేధిస్తున్నాడు. వాట్సప్‌కు మెసేజ్‌లు, వీడియోలు పంపిస్తున్నాడు. కాలర్ వివిధ ఫోన్ నంబర్లతో విసిగిస్తున్నాడు. దాంతో నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను అని సోనువాలియా తెలిపారు.

Sonu Walia receives obscene calls and videos from unknown person

1985లో సోనువాలియా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకొన్నారు. అదే సంవత్సరం మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొన్నారు. ఆమె నటించిన ఖూన్ భరీ మాంగ్ చిత్రానికి ఫిలింఫేర్ ఉత్తమ సహాయనటి అవార్డును అందుకొన్నారు. రజనీకాంత్ చిత్రం దళపతిలో ఓ ప్రత్యేక గీతంలో నటించారు.

English summary
Actress Sonu Walia, best known for her role in Khoon Bhari Maang, has been at the receiving end of obscene videos and lewd phone calls from an unknown person.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu