సోనీ సంస్థ చేతికి రవితేజ-పూరి మూవీ...
మాస్ మహరాజా రవితేజ, క్రేజీ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం 'దేవుడు చేసిన మనుషులు'. ఇలియానా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి రఘు కుంచె సంగీతం అందిస్తున్నారు. త్వరలో ఆడియో విడుదల చేయనున్నారు.
తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం ఆడియో రైట్స్‌ను 'సోనీ మ్యూజిక్' దక్కించుకుంది. సంగీత దర్శకుడు రఘు కుంచె ఈ విషయాన్ని వెల్లడిస్తూ ట్విట్టర్లో మెసేజ్ పోస్టు చేశాడు. జూన్ 16న ఆడియో విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. జులై నెలలో ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈచిత్రానికి సంబంధించి షూటింగ్ మొత్తం పూర్తయింది. హీరో రవితేజ డబ్బింగ్‌కు రెడీ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే పోస్టు ప్రొడక్షన్ పనులు ఊపందుకోనున్నట్లు చిత్ర యూనిట్ వర్గాల నుంచి అందిన సమాచారం. పెండింగులో ఉన్న పాటల చిత్రీకరణ ఇటీవలే విదేశాల్లో పూర్తి చేశారు.
దేవుడు చేసిన మనుషులు చిత్రాన్ని బివిఎస్ ఎన్ ప్రసాద్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్రం పతాకంపై ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. గతంలో పూరి జగన్నాథ్-రవితేజ కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ మంచి విజయం సాధించాయి. ఇది వారిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఐదో సినిమా.
రవితేజ ఇటీవల నటించిన దరువు చిత్రం అనుకున్న అంచనాలను చేరుకోలేక పోయింది. ఈ నేపథ్యంలో దేవుడు చేసిన మనుషులు చిత్రంపై బోలుడు ఆశలు పెట్టుకున్నాడు ఈ మాస్ హీరో. రవితే ఇదివరకు నటించిన దొంగలముఠా, వీర, నిప్పు సినిమాలు ప్లాపైన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











