'స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్ట్రైయిట్ తమిళ్ మూవీ...
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి అటు కోలీవుడ్ లోనూ, ఇటు మల్లువుడ్ లోనూ గ్రేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న విషయం తెలిసిందే. బన్నీ హీరోగా రూపొందిన తెలుగు చిత్రాలు కొన్ని మలయాళం, తమిళంలో డబ్ అవుతున్నాయి. మళయాలం లో ఆర్య, ఆర్య2 మరియు వరుడు లాంటి సినిమాలు గ్రేట్ బిజినెస్ ను చేశాయి. మరి మళయాల ప్రేక్షకులు ఏకంగా మన బన్నీకి మల్లు అర్జున్ అనే బిరుదుకూడా ఇచ్చేశారు. ఈ చిత్రాలు అక్కడి ప్రేక్షకలను కూడా ఆకట్టు కుంటున్నాయి.
అంతే కాదు ఈ మద్యనే ఓ ఇంటర్వ్యూ సందర్బంగా మళయాలంలో మంచి స్క్రిఫ్ట్ వస్తే తప్పకుండా స్ట్రయిట్ చిత్రం చేస్తానని స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు అల్లు అర్జున్. ఈ నేపధ్యంలో అర్జున్ కున్న అభిమానులను దృష్టిలో పెట్టుకుని జెమిని ఫిల్మింస్ సంస్థ అర్జున్ తో స్ట్రయిట్ తమిళ సినిమా ప్లాన్ చేస్తోందని సమాచారం. ఈ చిత్రానికి సుశీంద్రన్ దర్శకత్వం వహించే అవకాశాలున్నాయట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశముంది.


Click it and Unblock the Notifications











