twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆస్కార్ అవార్డులకు ఎంపికైన ‘సూరారై పొట్రు’: ఫైనల్ లిస్టులో సూర్య సినిమా

    |

    టాలెంటెడ్ లేడీ డైరెక్టర్ సుధ కొంగర దర్శకత్వంలో స్టైలిష్ హీరో సూర్య నటించిన చిత్రం 'సూరారై పొట్రు' (ఆకాశం నీ హద్దురా). కెప్టెన్ గోపీనాథ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్, శిఖ్య ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై సూర్య, గుణిత్ మోంగా నిర్మించారు. ఇందులో హీరోయిన్‌గా మలయాళ బ్యూటీ అపర్ణా బాలమురళీ నటించింది. అలాగే, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా కీలక పాత్రను పోషించారు. లాక్‌డౌన్ సమయంలో థియేటర్లు మూసి ఉండడంతో ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో నేరుగా ఆన్‌లైన్‌లో విడుదల చేసింది.

    సూర్య కెరీర్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'సూరారై పొట్రు' భారీ విజయాన్ని అందుకుంది. ఓటీటీ చరిత్రలో ఎక్కువ క్లిక్‌లు సాధించిన చిత్రంగా ఇది రికార్డు సాధించింది. మొదటిరోజు నుంచే మంచి టాక్‌ను అందుకున్న ఈ మూవీ.. తెలుగు, తమిళ భాషల్లోనూ సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఇక, ఇందులో సూర్య నటనకు ఇరు రాష్ట్రాల ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అలాగే, హీరోయిన్ అపర్ణ కూడా అదిరిపోయే యాక్టింగ్‌తో ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా సుధ కొంగర తెరకెక్కించిన విధానానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. దీంతో ఈ సినిమా ఆస్కార్‌ బరిలో నిలిచింది.

    Soorarai Pottru Got Place in OSCARS 2021 Final List

    సినిమా రంగానికి సంబంధించి ప్రపంచంలోనే అత్యుత్తమ అవార్డులు 'ఆస్కార్' అన్న విషయం తెలిసిందే. 2021వ సంవత్సరానికి గానూ ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రాల జాబితాలో 'సూరారై పొట్రు' ప్రదర్శన అయింది. ఇది ఆస్కార్ కమిటీ సభ్యులను మెప్పించడంతో తాజాగా ప్రకటించిన 366 చిత్రాల జాబితాలో చోటు సంపాదించుకుంది. ఇక, ఈ సినిమాకు అవార్డు వస్తుందా రాదా అన్నది మార్చి 15న తేలిపోనుంది. భారతీయ సినిమా ఆస్కార్ ఫైనల్ లిస్టులో చోటు దక్కించుకోవడంతో అన్ని ఇండస్ట్రీల నుంచి 'సూరారై ప్రొట్రు' టీమ్‌కు అభినందనలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా, 93వ ఆస్కార్ అవార్డుల వేడుక ఏప్రిల్ 25న జరగనుంది.

    English summary
    Soorarai Pottru is a 2020 Indian Tamil-language drama film directed by Sudha Kongara and produced by Suriya and Guneet Monga, under their respective banners 2D Entertainment and Sikhya Entertainment. The story was conceptualised and written by Kongara. The screenplay was written by Kongara and Shalini Ushadevi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X