For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  స్కైప్‌లోకి రమన్నాడు.. బట్టలు మొత్తం విప్పేసి చూపించమన్నాడు.. గుట్టు విప్పిన సింగర్

  |

  సింగర్ చిన్మయి శ్రీపాద మీటూ ఉద్యమాన్ని ఏ స్థాయిలో తీసుకెళ్లిందో అందరికీ తెలిసిందే. మీటూ ఆరోపణలు చేయడం వల్ల కోలీవుడ్‌లో ఆమె కెరీర్ క్లోజ్ అయిపోయింది. అయినా సరే ఆమె ఏ మాత్రం వెనకాడలేదు. వైరముత్తు లాంటి దిగ్జజాన్ని సైతం ఢీ కొట్టి నిలబడింది. వైరముత్తు, కార్తీక్, కైలాష్ ఖేర్ వంటి వారిపై ఎన్ని ఆరోపణలు వచ్చినా.. ఇండస్ట్రీలో అందరూ వారి తరుపునే మాట్లాడతారు. అయినా తాను మాత్రం వారితో కలిసి పని చేయదల్చుకోలేదు. తాను ఇప్పుడు చేయగలిగింది ఇది మాత్రమేనని చెబుతూ..

  పద్దెనిమిదేళ్ల వయసులో..

  పద్దెనిమిదేళ్ల వయసులో..

  స్విట్జర్లాండ్‌లోని సోఫియా అక్కర అనే సింగర్‌కు మన దేశంలోని మీటూ గురించి తెలియకుండానే గతేడాది 2019లో ఓ సంఘటనను షేర్ చేసింది అని చిన్మయి తెలిసింది. సదరు సింగర్ చెప్పిన సంఘటనను చిన్మయి పోస్ట్ చేసింది. సోఫియా అక్కర చెప్పిన కథనం ప్రకారం.. నాకు పద్దెనెమిదేళ్లు ఉన్నప్పుడు ఓ గొప్ప ప్లే బ్యాక్ సింగర్‌ను కలిసే అవకాశం వచ్చింది. ఆయన పాటలకు నేను ప్లే బ్యాక్ సింగర్‌ను. పైగా ఆయన చేసే పనిని ఆరాధిస్తాను అని చెప్పుకొచ్చింది.

  కెమెరా ముందు నగ్నంగా

  కెమెరా ముందు నగ్నంగా

  ఆయన స్కైప్ ఐడీ అడిగినప్పుడు నాకు వేరేలా అనిపించలేదు.. చాలా ఎగ్జైట్ అయ్యాను. అతనికి పెళ్లి అయింది.. పిల్లలు కూడా ఉన్నారు. నాకంటే చాలా పెద్ద వారు. కానీ ఫస్ట్ స్కైప్ కాల్‌తోనే ఆయనపై ఉన్న గౌరవం మొత్తం పోయింది. కెమెరా మొత్తం బట్టలు విప్పేసి నగ్నంగా ఉండమని అన్నాడు. నేను దెబ్బకు షాక్ అయ్యాను అని సోఫియా చెప్పుకొచ్చింది.

   ఎవ్వరూ నమ్మరు..

  ఎవ్వరూ నమ్మరు..

  అయినా సరే కామ్‌గా ఉన్నాను. మీరు అలా ఎలా అడుగుతారు అని ప్రశ్నించాను. ఇది నేను మీడియాకు చెబుతాను అన్న భయం కూడా లేదా? అని బెదిరించాను. దానికి అతను.. నువ్ చెప్పినా కూడా ఎవ్వరూ నమ్మరు అని సమాధానం ఇచ్చాడని సోఫియా చెప్పినట్టుగా చిన్మయి పేర్కొంది.

  కళ్లు తెరిపించింది..

  కళ్లు తెరిపించింది..


  అయితే ఈ అనుభవం నాకో గుణపాఠంగా మారింది. నేను ఎంతో బాధపడ్డాను. అప్పటి నుంచి ఓ స్టార్‌ను స్టార్‌లా చూడటం మానేశాను. ఈ ఘటన జరినందుకు చాలా సంతోషించాను. ఆ ఘటన నా కళ్లు తెరిపించింది. ఇంకా ఎలాంటి జరుగుతాయో అన్న వాటికి నన్ను ముందుగానే ప్రిపేర్ చేసిన ఘటన అది. ఎవరి చేతిలో ఫూల్ అవ్వకుండా చూసుకోండి అని సోఫియా పేర్కొంది.

  Samantha Fans Demand Apologize From Pooja Hegde
  ఎంతో మందికి ఇలానే...

  ఎంతో మందికి ఇలానే...

  చిన్మయి తన స్టోరీలను మరోసారి రీపోస్ట్ చేసినందుకు థ్యాంక్స్.. ఓ సోదరిలా ఆమెకు నా సాయాన్ని అందించాలని అనుకుంటున్నాను. అందుకే ఆమె పోస్ట్ చేసిన వాటిని మళ్లీ నా స్టోరీలో రీపోస్ట్ చేస్తున్నాను. మీ కంటిని తెరిచే ఉంచండి.. ఇది చాలా ఎమోషనల్ స్టోరీ.. ఇందులో చాలా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండొచ్చు. ఎందుకంటే నా మాతృభాష జర్మన్. నాకు జరిగినట్టుగానే చాలా మంది అమ్మాయిలకు అలాంటి ఘటనలను జరిగాయి. అందుకే అందరికీ అవగాహన కలిగించాలనే ఈ విషయాలు చెప్పాను అంటూ తన స్టోరీని మళ్లీ షేర్ చేసినందుకు సోఫియా చిన్మయికి థ్యాంక్స్ చెప్పింది.

  English summary
  Sophia akkara Me too Alleges On Singer Karthik, Chinmayi Shares Sophia akkara bad incidents with singer.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X