మహేష్ ‘1’ : సోఫీ చౌదరి సెక్సీ ప్రదర్శన..? (ఫోటోలు)
హైదరాబాద్ : మహేష్ బాబు-సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న '1' సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం వినిపిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ సెక్సీ ఐటం గర్ల్ సోఫీ చౌదరి ఐటం సాంగు చేయబోతోందని తెలుస్తోంది. గతంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరు వినిపించినా...ఇప్పుడు సోఫీ చౌదరిని ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారట.
దర్శకుడు సుకుమార్ తన సినిమాల్లో ఐటం భామలు యమ సెక్సీగా ప్రజెంట్ చేయడం చూస్తూనే ఉన్నాం. ఆయన సినిమాల్లో ఏది ఉన్నా లేక పోయినా...ఐటం సాంగు మాత్రం కేక పుట్టించే రేంజిలో ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా '1' సినిమాలో ఐటం సాంగు విషయం కూడా సర్వత్రా చర్చనీయాంశం అయింది.
'1' సినిమాలో ఆమో సాంగ్ ఓకే అయితే ఇదే ఆమె చేయబోయే తొలి తెలుగు సినిమా అవుతుంది. త్వరలో ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మిగతా వివరాలు స్లైడ్ షోలో...

బాలీవుడ్లో అదరగొడుతోంది
ఇటీవల విడుదలైన బాలీవుడ్ మూవీ ‘షూటౌట్ ఎట్ వాడాలా' చిత్రంలో సోఫీ చౌదరి తన సెక్సీ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. గతంలో ‘వేడి' అనే తమిళ సినిమాలో ఐటం సాంగులో నర్తించి తన గ్లామర్ విశ్వరూపం చూపింది. ఇప్పుడు బాలీవుడ్ మూవీ వన్స్ అపాన్ ఎ టైం ఇన్ ముంబై దొబారా అనే చిత్రంలో చేస్తోంది.

‘1' షూటింగ్ లండన్లో జరుగుతోంది
‘1'(నేనొక్కడినే) చిత్రం బెల్ ఫాస్ట్, నార్తర్న్ ఐర్లాండ్‌లలో పూర్తి చేసుకుని తాజాగా లండన్ నగరానికి షిప్టయింది. యూనిట్ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం జులై 20 వరకు ఇక్కడ షూటింగ్ జరుపుతారని తెలుస్తోంది.

గౌతం కృష్ణ తెరంగ్రేటం
ఈ 20 రోజుల పాటు ఇక్కడ యాక్షన్ సన్నివేశాలు, చేజింగ్ సీన్లు చిత్రీకరించనున్నారు. మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ ఈ సినిమాతో తెరంగ్రేటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు చిన్నప్పటి పాత్రను గౌతమ్ పోషిస్తున్నాడు. ఇటీవలే అందుకు సంబంధించిన సీన్లు చిత్రీకరించారు.

గౌతం పాత్ర ఏమిటంటే..
గౌతమ్‌ను నటింపజేసేందుకు మహేష్ ముందు ఒప్పుకోలేదని, దర్శకుడు సుకుమార్ కన్విన్స్ చేయడంతో ఒప్పుకున్నారని తెలుస్తోంది. సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో గౌతమ్ పాత్ర వస్తుంది.

ఇతర వివరాలు
సాయాషి షిండే, కెల్లీ దోర్జి, విక్రం సింగ్, శ్రీనివాస రెడ్డి, నాజర్, ప్రదీప్ రావత్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంలో ఆచంట రామ్, ఆచంట గోపీచంద్, అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











