నేనేం అంత పెంచలేదు..హాట్ హన్సిక కోపం
మీరు ప్రచారం చేస్తున్నంతగా నేనేమి నా పారితోషికం పెంచలేదు అని బుంగమూతి పెడుతోంది హన్సిక. హిట్టు,ఫ్లాప్ లతో సంభంధం లేకుండా తన ఇష్టం వచ్చినట్లు పెంచేస్తోంది అని వస్తున్న వార్తలను ఆమె ఖండిస్తూ మీడియాతో మాట్లాడింది.ఆమె మాటల్లోనే..మాట్లాడుతూ పారితోషికం విషయంలో నాపై అనవసర ప్రచారం సాగుతోంది. సినిమా సినిమాకీ పెంచేస్తున్నానని అంటున్నారు. కానీ నేను అలా ఏమీ చేయడం లేదు. నా మార్కెట్‌ను బట్టే అడుగుతున్నాను. ఇకపోతే ఎక్స్‌పోజింగ్ విషయంలో నాకు కొన్ని పరిమితులున్నాయి. కథ, నా పాత్ర డిమాండు చేస్తే ఎలాంటి దుస్తుల్లో కనిపించడానికైనా వెనకాడను. మేం ఏం చేసినా ప్రేక్షకుల్ని ఆనందింపజేయడానికే కదా..! అంటోంది.
అలాగే తాన మనస్సులో కోరికలు చెపుతూ...దక్షిణాదిన అన్ని భాషల్లోనూ నటించాలి. ఇప్పుడిప్పుడే తమిళంలోనూ మంచి అవకాశాలొస్తున్నాయి. ధనుష్‌తో ఓ చిత్రంలో చేస్తున్నాను. విష్ణువర్ధన్ దర్శకత్వంలో సూర్య సరసన ఓ సినిమాలో నటించాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల అది వీలు కాలేదు. కానీ ఆయనతో నటించాలన్న కోరిక మాత్రం అలాగే ఉంది. నాకు ఇష్టమైన నటుడు ఆయన. హిందీ విషయానికొస్తే..రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ సరసన 'మైఁ ఔర్ మేరీ హిమ్మత్' చిత్రంలో నటించబోతున్నాను. సంఘమిత్ర చౌదరి దర్శకుడు. ఇమ్రాన్ ఖాన్ సరసన కూడా ఓ సినిమా ఒప్పుకొన్నాను. సంజయ్ గాడ్గిల్ దర్శకత్వం వహిస్తారు అంటూ చెప్పుకొచ్చింది. ఇక గోపీచంద్ సరసన గోలీమార్ చిత్రంలో ఆమె చేస్తోందా లేదా అన్న విషయం మాత్రం దాటేసింది. అలాగే పూరీ జగన్నాధ్ దగ్గర రెమ్యునేషన్ విషయంలో తేడా వచ్చే ఆమెను ప్రక్కన పెట్టారనేది తెలిసిందే.


Click it and Unblock the Notifications











