కోర్టుకెక్కిన సౌందర్య ఆస్ధి గొడవలు
బెంగుళూరు : 2004 లో విమాన ప్రమాదంలో అకాల మరణం చెందిన సౌందర్య ఆస్దులు కోసం ఇప్పుడు లీగల్ గా పోరాటాలు జరుగుతున్నాయి. దాదాపు 50 కోట్ల ఆస్ధి కోసం ఆమె కుటుంబ సభ్యులు కోర్టుకు ఎక్కారు. సౌందర్య తో పాటు ప్రమాదంలో మరణించిన ఆమె సోదరుడు అమర్ నాధ్ భార్య నిర్మల, ఆమె కుమారుడు సాత్విక్ ఈ వివాదానికి తెరతీసారు. సౌందర్య భర్త రాజు మరో వివాహం చేసుకున్నారు. ఈ వివాదంలో సౌందర్య తల్లి,ఆమె భర్త రాజు ఓ వర్గంగా పోరాడుతున్నారు.
సౌందర్య రాసిన వీలునామా ప్రకారం ఒక ఇంటిని తన మేనల్లుడు సాత్విక్ కి, మరొక నిర్మాణంలో ఉన్న ఇంటిని ఉమ్మిడి ఆస్ధిగా రాసిందని చెప్తున్నారు. హైదరాబాద్ లో వచ్చే ఆస్దిపై వచ్చే ఆదాయాన్ని తల్లికి,సోదరుని కుటుంబానికి,మిగిలిన ఆస్దులు భర్తకు,పిల్లలకు చెందాలని రాసి ఉంది. అయితే సాత్విక్ కు చెందాల్సిన ఆస్ధిని సౌందర్య తల్లి అంటే సాత్విక్ నాయనమ్మ అడ్డుపడుతోంది అంటున్నారు. దాంతో వారు కోర్టుకు ఎక్కారు. 2003 లో రాసినట్లుగా చెప్పబడుతున్న ఈ వీలునామా ఫోర్జరీ చేసిందంటూ తల్లి మంజుల, ఆమె భర్త సదాశివనగర్ లో పిర్యాదు చేసారు. కోర్టు...నవంబర్ 2 వ తేదీకి కేసుకి హాజరు కావాలని సమన్లు పంపింది.
మరో ప్రక్క సౌందర్య ఆభరణాలు అలాగే ఆమె షాప్ ఓపినింగ్స్ వెళ్లినప్పుడు కానుకలుగా వచ్చినవి అన్నీ ఆమె తల్లి దగ్గరే ఉన్నాయని ఆరోపణ. ఆ ఆభరణాలులో వెండి,బంగారం,వజ్రాలు ఉన్నాయని,అవే చాలా ఖరీదు చేస్తాయని అంటున్నారు. ఇక తన మరణాన్ని..ముందే సౌందర్య ఎలా ఊహిస్తుందని కాబట్టి అసలు ఆ వీలునామా రాసే వీలులేదని సౌందర్య వదిన నిర్మల వాదన. కోర్టు ఈ విషయమై నిజానిజాలు తేల్చాల్సి ఉంది. ఈ కేసు చాలా కాలం తర్వాత సౌందర్యని మరోసారి జనాలకి గుర్తు చేసింది.


Click it and Unblock the Notifications











