క్రికెటర్‌తో అనుమపర పరమేశ్వరన్ ప్రేమాయణం.. క్లారిటీ ఇచ్చేసింది

Recommended Video

Is Anupama In Love With Cricketer Bumrah ? || Filmibeat Telugu

సెలెబ్రెటీల ప్రేమ సంగతులకు, సాధారణ ప్రజానీకానికి సోషల్ మీడియా మంచి రాయబారం నడుపుతోంది. ఎప్పటికప్పుడు తాజా లవ్ ఎఫైర్స్ నెటిజన్ల ముందుంచుతూ ఆసక్తి రేపుతోంది. అసలే సెలెబ్రిటీలు, అందునా ప్రేమ ముచ్చట్లు కావడంతో నెటిజన్లు వాటి పట్ల బాగా ఆకర్షితులవుతున్నారు. అయితే సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన అన్ని సందేశాలు నమ్మదగినవి కావు. కొంతమంది కొన్ని రూమర్స్ కావాలనే పుట్టిస్తారు. దీంతో వాటి పట్ల సదరు సెలెబ్రిటీలు స్పందిస్తే తప్ప అసలు విషయం బయటకు రాదు. అలాంటి ఓ సెన్సేషనల్ రూమర్ టాలీవుడ్ యంగ్ హీరోయిన్ పై పడింది. అయితే ఇది నిజమేనా? దీనిపై అనుపమ రియాక్షన్ ఏంటి? ఆ వివరాలు చూస్తే..]

 క్రికెటర్లకు, సినిమా వాళ్లకు లింకులు

క్రికెటర్లకు, సినిమా వాళ్లకు లింకులు

సాధారణ జనాల్లో ఎక్కువ క్రేజ్ ఉండేదంటే ఒకటి క్రికెటర్స్‌కి, రెండు సినిమా వాళ్లకి. దీంతో రూమర్లు పుట్టించే వారు ఎక్కువగా ఈ రెండు వర్గాలనే హైలైట్ చేస్తారు. ముఖ్యంగా యంగ్ హీరోయిన్స్, యువ ఆటగాళ్ల మధ్య లింకులు పెడుతూ వాటిని వైరల్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ బ్యూటీ అనుమప పరమేశ్వరన్.. ఓ యువ క్రికెటర్ తో రొమాన్స్ చేస్తోందనే వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి.

క్రికెటర్ బుమ్రాతో అనుపమ ప్రేమ వ్యవహారం

క్రికెటర్ బుమ్రాతో అనుపమ ప్రేమ వ్యవహారం

భారత ఫాస్ట్ బౌలర్ బుమ్రాతో సౌత్ సినీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ప్రేమలో మునిగి తేలుతోందని ప్రస్తుతం సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఈ ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం బాగా ముదిరిందని వార్తలు కూడా షికారు చేస్తున్నాయి. ఇద్దరి సోషల్ మీడియా అకౌంట్స్‌లో ఒకరినొకరు ఫాలో అవుతుండటం ఈ వార్తలకు మరింత బలాన్నిచ్చింది. అయితే ఇవి కాస్త అనుపమ కంట్లో పడటంతో వెంటనే అనుపమ రియాక్ట్ అయింది.

 అనుపమ క్లారిటీ

అనుపమ క్లారిటీ

ఈ వ్యవహారంపై అనుపమ స్పందిస్తూ ఓ క్లారిటీ ఇచ్చేసింది. బుమ్రా తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని, అంతకుమించి తమ మధ్య ఎలాంటి రేలషన్‌షిప్ లేదని ఈ సందర్బంగా ఆమె పేర్కొంది. ఎవ్వరికీ ఉపయోగం లేని ఇలాంటి వార్తలు పుట్టించడం వల్ల ఏమొస్తుందో నాకైతే అర్థం కావడం లేదు.. అని ఘాటు రియాక్షన్ ఇచ్చింది అనుపమ.

గతంలో రాశి ఖన్నాతో.. ఇప్పుడు అనుపమతో

గతంలో రాశి ఖన్నాతో.. ఇప్పుడు అనుపమతో

ఇదే బుమ్రాతో రాశి ఖన్నా డేటింగ్ చేస్తోందని గతంలో వార్తలు రాగా.. వాటిని వెంటనే ఖండించింది రాశి. దీంతో ఆ వార్తలకు ఫుల్‌స్టాప్ పడగానే ఇప్పుడు అదే బుమ్రాతో అనుపమ పరమేశ్వరన్ ని లింక్ చేయడం జనాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మరి అనుపమ క్లారిటీ ఇచ్చేసింది కాబట్టి.. మళ్ళీ ఎవరితో లింక్ చేస్తారో చూడాలి మరి! మొత్తంగా చూస్తే ఈ సోషల్ మీడియా యుగం అనేది హీరోయిన్లకు ప్లస్ అవుతోందా? లేక మైనస్ అవుతోందా? అర్థం కావడం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X