సుమంత్ సినిమాను కొన్న క్రికెటర్ గంగూలీ
హీరో సుమంత్, కలర్స్ స్వాతి ప్రదాన పాత్రల్లో ఆ మధ్య వచ్చిన 'గొల్కొండ హైస్కూల్' చిత్రం మంచి టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సుమంత్ సినీ కెరీర్లోనే మంచి చిత్రంగా ప్రశంసలు అందుకుంది. క్రికెట్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందించారు. సుమంత్ ఈచిత్రంలో క్రికెట్ కోచ్ పాత్రలో నటించాడు.
తాజాగా ఈ చిత్రంపై మాజీ క్రికెటర్ గంగూలీ కన్ను పడింది. ఈ చిత్రం ద్వారా ప్రొడ్యూసర్, నటుడిగా మారబోతున్నాడు క్రికెటర్. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని బెంగాలీలో రీమేక్ చేయాలనే ఆలోచనలో గుంగూలీ ఉన్నాడని, ఇందుకు సంబంధించి రైట్స్ కూడా కొనుగోలు చేశాడని సమాచారం.
గోల్కొండ హైస్కూల్ చిత్రానికి మోహన్ కృష్ణ ఇంద్రగంటి కథ సమకూర్చడంతో పాటు, దర్శకత్వం వహించారు. రామ్మోహన్ పరువు ఈచిత్రాకి నిర్మించారు. కోచ్ ఎలా ఉండాలి, జట్టులో టీమ్ స్పిరిట్ ఎలా పెంపొందించాలి అనే కాన్సెప్టుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.


Click it and Unblock the Notifications











