»   » ఆ హీరోతో లేచిపోవటానకి రెడీ...ఖష్బూ

ఆ హీరోతో లేచిపోవటానకి రెడీ...ఖష్బూ

Posted By:
Subscribe to Filmibeat Telugu

పెళ్ళికి ముందు సెక్స్ తప్పు కాదు అంటూ ఆ మధ్య స్టెట్ మెంట్ ఇచ్చి సంచలనం రేపిన ఖుష్భూ...మరో సారి వార్తల్లో నిలవటానికి ప్రయత్నం చేస్తోంది. తాను కావాలనుకుంటే బాలీవుడ్ హీరో గోవిందాను ఏ క్షణంలోనయినా లేపుకుపోగలను అంటూ కామెంట్ చేసింది. అలాగే గోవిందాతో తనుకున్న సాన్నిహిత్యాన్ని మీడియాకు వివరించింది. తాను ముంబై ఎప్పుడు వెళ్ళినా గోవిందా ఇంట్లోనే దిగుతానని, గోవిందా తనని చాలా అభిమానంగా చూస్తాడని అంది. అలాగే తాను గోవిందా భార్య సునీతతో క్లియర్ గా చెప్పేసానని, ఇరవై ఆరేళ్ళపాటు (గోవిందా పెళ్లై ఇరవై ఆరేళ్ళు అయింది) నీకు గోవిందాను వదిలేసాను...ఇక నేను ఇప్పుడు లేపుకుపోతాను అన్నానని అంది. అయితే ఖష్బూ ఈ విషయాన్ని సరదాగా చెప్పినా మీడియా మాత్రం సీరియస్ గా తీసుకుంటోంది. పెళ్ళికి ముందు సెక్స్ లేదన్న ఖుష్బు ఇప్పుడు పెళ్ళయిన మగాడితో కాపురం తప్పులేదని చెప్తోందా అని అర్ధాలు తీస్తోంది.అందులోనూ సుప్రింకోర్టు ఆమె వాదనను కరెక్టే అనటం ఆమెకు నైతికంగా బలం ఇచ్చి ఇలా మాట్లాడుతోందని అంటున్నారు. ఇక ఖష్భూ నటించిన బాలీవుడ్ సినిమా దీవానా ముజిసే నహీ...ఈ చిత్రంలో అమీర్ ఖాన్, మాధురీ దీక్షిత్ కలిసి చేసారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu