twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ బాబు స్క్రీన్ అత్త...కోర్టు వివాదాలు

    By Bojja Kumar
    |

    South actress Saritha and actor Mukesh case details
    హైదరాబాద్: అర్జున్ సినిమాలో మహేష్ బాబుకు ఆన్ స్క్రీన్ అత్తగా నటించిన నటి సరిత గత కొంత కాలంగా కోర్టు వివాదాల్లో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. తనకు వ్యతిరేకంగా తన భర్త కుట్ర పన్నుతున్నాడని ఆమె ఆరోపిస్తున్నారు. ఆమె భర్త, మళయాల నటుడు అయిన ముఖేష్ తో ఆమెకు మధ్య విడాకుల విషయంలో కోర్టు కేసు నడుస్తోంది. ఆ కేసు ఇంకా ఓ కొలిక్కి రాలేదని సమాచారం.

    కాగా గత కొన్ని రోజుల క్రితం ముఖేష్ రెండో వివాహం చేసుకున్నారు. చట్టవిరుద్ధంగా తన భర్త రెండో వివాహం చేసుకున్నారని.. ఆయనపై కేసు పెట్టనున్నట్లు సరిత ఆ మధ్య మీడియాకు వెల్లడించిన సంగతి తెలిసిందే. అభిప్రాయభేదాల కారణంగా తాను, భర్త వేర్వేరుగా నివసిస్తున్నట్లు తెలిపారు. తన మొదటి కుమారుడు షర్వన్‌ దుబాయ్‌లో వైద్య కోర్సు చేస్తున్నాడని, రెండో కుమారుడు తేజస్సు డిగ్రీ చదువుతున్నాడని వివరించారు. వారికి తోడుగా తాను కూడా అక్కడే ఉంటున్నట్లు పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో తన భర్త ముఖేష్‌ మరో మహిళను వివాహం చేసుకున్నట్లు ఆరోపించారు. ఈ విషయమై తాను ముఖేష్‌పై కేసు పెట్టనున్నట్లు తెలిపారు.

    సరిత చెప్పిన వివరాల ప్రకారం... 1988 ముఖేష్‌ తో సరిత వివాహం కేరళలో జరిగింది. వీరికి ఇద్దరు కొడుకులు. 2007లోనే ఆయనపై పలు ఆరోపణలు చేస్తూ విడాకులు కోరుతూ సరిత కోర్టుకు వెళ్లగా....ముఖేష్ విడాకులు ఇవ్వడానికి నిరాకరించారు. ఆ తర్వాత 2009లో పరస్పర అంగీకారంతో కూడిన విడాకులు కోరుతూ చెన్నరు ఫ్యామిలీ కోర్టుకు వెళ్లారు. అయితే ముఖేష్ కోర్టుకు సరిగా హాజరుకాని కారణంగా....ఆమె ఆ పిటీషన్ 2010లో ఉపసంహరించుకుంటున్నారు. ప్రస్తుతం సరిత ఇద్దరు కుమారులు శ్రవణ్, తేజా్ దుబాయ్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. వారి ఆలనా పాలన చూస్తు వారితో పాటే ఉంటున్నారు సరిత. మరోచరిత్ర, కోకిలమ్మ, అచ్చమిల్త్లె అచ్చమిల్త్లె తదితర చలన చిత్రాల్లో నటించి ఆమె గుర్తింపు పొందారు.

    English summary
    South actress Saritha and actor Mukesh who were separated some years ago is contemplating legal action and charging Mukesh with bigamy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X