‘సౌత్ సినీ స్టార్స్ భలే అదృష్ట వంతులు’
దక్షిణాది ప్రేక్షకులను బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్ ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. అలాంటి ప్రేక్షకులు ఉండటం ఇక్కడి సౌత్ స్టార్స్ అదృష్టమంటూ పొగడ్తలు గుప్పిస్తున్నాడు. అంతే కాదు దక్షిణాది ప్రేక్షకులు చాలా మంచోళ్లు అంటూ కితాబిస్తున్నాడు.
ఇటీవల ఆయన ఓ సందర్భంలో మాట్లాడుతూ...దక్షిణాదిన సినిమా నటుల్ని దేవుళ్లలాగా కొలుస్తుంటారు, రజినీ కాంత్ లాంటి స్టార్స్ ని గుండెల్లో గుడి కట్టుకుని పూజిస్తారు అని అన్నారు. ఇక్కడ చాలా మంది ప్రేక్షకులు థియేటర్లకే వెళ్లి సినిమాలు చూస్తుంటారు..కానీ ఉత్తరాదిన అలా కాదు, ఎక్కువ శాతం మంది డీవీడీలపై పడుతుంటారు చెప్పుకొచ్చారు. దక్షిణాదిన జయాపజయాలతో సంబంధం లేకుండా సీని ప్రియులు వచ్చిన ప్రతి సినిమాను చూస్తారు, కానీ ఉత్తరాదిన సినిమా బాగోలేదని టాక్ వస్తే మళ్లీ థియేటర్ల వైపే చూడరు అంటూ వ్యాఖ్యానించారు.
జాకీష్రాఫ్ వ్యాఖ్యలపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏ ప్రాంత ప్రేక్షకులైనా సినిమా తీరుబట్టే స్పందిస్తారు. నచ్చితే చూస్తారు, లేక పోతే చూడరు. అలా అని ఓ ప్రాంతం వారిని ఎక్కువ, మరో ప్రాంతం వారిని తక్కువ చేసి మాట్లాడటం సరికాదంటున్నారు.


Click it and Unblock the Notifications











