twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సౌత్ సినీ ఇండస్ట్రీ విలువ రూ. 21వేల కోట్లు: కమల్

    By Bojja Kumar
    |

    చెన్నై: సౌతిండియా సినీ పరిశ్రమ విలువ రూ. 21,190 కోట్లు ఉంటుందని ప్రముఖ నటుడు, భారతీయ వాణిజ్యమండలి, పరిశ్రమల సమాఖ్య మీడియా(ఫిక్కి), ఎంటర్‌టైన్‌మెంట్‌ బిజినెస్‌ కంక్లేవ్‌ (ఎంఈబీసీ) ఛైర్మన్‌ కమల్‌ హాసన్‌ అన్నారు. వందేళ్ల భారతీయ సినిమాపై రెండు రోజుల ప్రత్యేక సదస్సు ఈ రోజు చెన్నయ్ లో ప్రారంభైంది.

    ఈ సందర్భంగా కమల్ హానస్ మాట్లాడుతూ.... భారతీయ సినీ పరిశ్రమ వాటాలో 65-70 శాతం సినిమాలు సౌత్ నుంచి వస్తున్నాయని చెప్పుకొచ్చారు. నేను మాట్లాడేది స్వోత్కర్షలా ఉన్న.... ఇది వాస్తవమని కమల్ హాసన్ స్పష్టం చేసారు. సౌతిండియా సినిమా భారతీయ సినీ పరిశ్రమలో ముఖ్యభూమిక పోషిస్తోందన్నారు.

    ఈ సదస్సులో వందేళ్ల భారతీయ సినిమా, రానున్న శతాబ్దంలో సవాళ్లు, అవకాశాలు, సినిమాలో మహిళల పరిణామక్రమం, మీడియా వార్తల్లో విశ్వసనీయత, డిజిటల్‌ సౌండ్‌ టెక్నాలజీ, డిజిటల్‌ ఫిల్మ్‌ మేకింగ్‌, స్క్రీన్‌రైటింగ్‌... ఇలాంటి పలు కీలక అంశాలపై చర్చలు చర్చ జరుగనుంది. ఈ సదస్సులో నిర్మాత సురేష్ బాబు, అమెరికన్ ప్రొడ్యూసర్ బార్రీ, తమిళ దర్శకుడు అమీర్ తదితరులు పాల్గొన్నారు.

    ఆ విషయం పక్కన పెడితే... కమల్‌హాసన్‌ దర్శకత్వం వహిస్తూ నటించిన చిత్రం 'విశ్వరూపం'. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోంది. ఆండ్రియా, పూజాకుమార్‌ హీరోయిన్స్. ప్రస్తుతం ఆరో 3డీ టెక్నాలిజీని ఈ చిత్రానికి అద్దడంలో నిమగ్నమై ఉన్నారు. తొలిసారిగా ఈ సాంకేతిక పరిజ్ఞానంతో ఇండియన్ సినిమా రూపొందిస్తుండటం విశేషం. సినిమాలోని పాటల్ని కమల్‌హాసన్‌ జన్మదినం సందర్భంగా నవంబరు 7న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

    English summary
    Actor-filmmaker Kamal Hassan Tuesday said that the south Indian film industry is worth Rs. 21,190 crore and accounts to 65-70 percent of total movies produced in the country.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X