For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ దీక్షాసేథ్‌ కి బంపర్ ఆఫర్

    By Srikanya
    |
    హైదరాబాద్ : 'వేదం', 'మిరపకాయ్‌', 'నిప్పు' లాంటి చిత్రాల్లో నటించిన దీక్షా సేథ్‌కి వరస ఫ్లాపులతో తెలుగులో సతమతమవుతూ దాదాపు సినిమాలు లేవు అనే స్ధాయికి చేరుకున్న దీక్షాసేధ్ కి బంపర్ ఆఫర్ వచ్చినట్లైంది. ఆమెకు బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. వరసగా హిందీ చిత్రసీమ వైపు వెళ్తున్న తెలుగు హీరోయిన్స్ లిస్ట్ లో చేరింది.

    బాలీవుడ్‌ నుంచి పిలుపు వచ్చింది. కరీనా కపూర్‌, రణబీర్‌ కపూర్‌లకు వరుసకు సోదరుడయ్యే ఆర్మన్‌ జైన్‌ హీరో గా ఓ చిత్రం రూపొందబోతోంది. ఈ సినిమాను సైఫ్‌ అలీఖాన్‌ నిర్మిస్తున్నారు. ఆరిఫ్‌ అలీ దర్శకత్వం వహిస్తారు. ప్రముఖ దర్శకుడు ఇంతియాజ్‌ అలీకి ఆరిఫ్‌ స్వయానా సోదరుడు. కరీనా కుటుంబంతో ఆర్మన్‌ సన్నిహితంగా ఉంటారు.

    గత కొంతకాలంగా ఆర్మన్‌ జైన్‌ ని హీరో గా కెమెరా ముందుకు తీసుకురావాలని ఆమె భావిస్తోంది. ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది. తెలుగులో వరుసగా చిత్రాలు చేసిన పంజాబీ భామ దీక్షకి విజయం మాత్రం దక్కలేదు. ఇప్పుడు హిందీ సినిమా దక్కడంతో సంతోషంగా ఉంది.

    ఇక ఆ మధ్య మాట్లాడుతూ... చిరంజీవి 150వ సినిమాలో నటించాలని ఉంది. అయితే అలాంటి అవకాశం దొరకదు. మనం ఎన్నో అనుకుంటాం అన్నీ జరగవుకదా అని నిరశా చెందింది. చిరు సినిమాలో ప్రత్యేక గీతమైనా సరే...ఆనందంగా ఒప్పుకుంటా. ఇప్పుడున్న యువ హీరోలలో నటించాలని ఉంది. అంతే కాకుండా ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగాలంటే..హీరోయిన్ గా కొన్ని పాటించాలి. గ్లామర్ మెయింటేన్ చేయాలి.

    తమిళంలో అయితే అక్కడి వారికి ముద్దుగా, బొద్దుగా ఉంటేనా చాలా ఇష్టపడతారు.. అవకాశాలు అవస్తాయంటూ..ప్రేక్షకులతో అనుసంధానమయ్యే కార్యక్రమాలంటే చాలా ఇష్టం. పరస్పర ఆలోచనల్ని పంచుకొనే వీలు చిక్కుతుంది. మాక్కూడా కాస్త కొత్తగా ఉంటుంది. అందుకే ఇలాంటి కార్యక్రమాలకు హజరవుతా..ఇలా వచ్చి అలా వెళ్లిపోయిన పరాయి నటిని అనిపించుకోకూడదు. పదేళ్లయినా ఇక్కడే నిలవాలి. పట్టున్న పాత్రలు చేయాలి.ఇవే నేను కోరుకుంటున్నది..అని తన మనస్సులోని భావాలను తెలిజేసింది.

    English summary
    Pre-production work is on in full swing at Saif Ali Khan and Dinesh Vijan's Illuminati Films on the venture which will introduce Kareena and Ranbir Kapoor's cousin, Armaan Jain. A new girl has been cast opposite him and there's a buzz that Jain will be romancing South girl Deeksha Seth. Seth is a model-turned actress, who made her debut in the Telugu film Vedam opposite South star Allu Arjun in 2010. She went on to do several other Telugu films, including Mirapa-kaay opposite Ravi Teja, a film which was a commercial hit.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X