Don't Miss!
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్‌కు మళ్లీ అన్యాయమే!
- News మోదీని ప్రధానిని చెయ్యండి.. తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- Technology వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హాట్ దీక్షాసేథ్ కి బంపర్ ఆఫర్
బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. కరీనా కపూర్, రణబీర్ కపూర్లకు వరుసకు సోదరుడయ్యే ఆర్మన్ జైన్ హీరో గా ఓ చిత్రం రూపొందబోతోంది. ఈ సినిమాను సైఫ్ అలీఖాన్ నిర్మిస్తున్నారు. ఆరిఫ్ అలీ దర్శకత్వం వహిస్తారు. ప్రముఖ దర్శకుడు ఇంతియాజ్ అలీకి ఆరిఫ్ స్వయానా సోదరుడు. కరీనా కుటుంబంతో ఆర్మన్ సన్నిహితంగా ఉంటారు.
గత కొంతకాలంగా ఆర్మన్ జైన్ ని హీరో గా కెమెరా ముందుకు తీసుకురావాలని ఆమె భావిస్తోంది. ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది. తెలుగులో వరుసగా చిత్రాలు చేసిన పంజాబీ భామ దీక్షకి విజయం మాత్రం దక్కలేదు. ఇప్పుడు హిందీ సినిమా దక్కడంతో సంతోషంగా ఉంది.
ఇక ఆ మధ్య మాట్లాడుతూ... చిరంజీవి 150వ సినిమాలో నటించాలని ఉంది. అయితే అలాంటి అవకాశం దొరకదు. మనం ఎన్నో అనుకుంటాం అన్నీ జరగవుకదా అని నిరశా చెందింది. చిరు సినిమాలో ప్రత్యేక గీతమైనా సరే...ఆనందంగా ఒప్పుకుంటా. ఇప్పుడున్న యువ హీరోలలో నటించాలని ఉంది. అంతే కాకుండా ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగాలంటే..హీరోయిన్ గా కొన్ని పాటించాలి. గ్లామర్ మెయింటేన్ చేయాలి.
తమిళంలో అయితే అక్కడి వారికి ముద్దుగా, బొద్దుగా ఉంటేనా చాలా ఇష్టపడతారు.. అవకాశాలు అవస్తాయంటూ..ప్రేక్షకులతో అనుసంధానమయ్యే కార్యక్రమాలంటే చాలా ఇష్టం. పరస్పర ఆలోచనల్ని పంచుకొనే వీలు చిక్కుతుంది. మాక్కూడా కాస్త కొత్తగా ఉంటుంది. అందుకే ఇలాంటి కార్యక్రమాలకు హజరవుతా..ఇలా వచ్చి అలా వెళ్లిపోయిన పరాయి నటిని అనిపించుకోకూడదు. పదేళ్లయినా ఇక్కడే నిలవాలి. పట్టున్న పాత్రలు చేయాలి.ఇవే నేను కోరుకుంటున్నది..అని తన మనస్సులోని భావాలను తెలిజేసింది.