twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇష్టం లేకున్నా ఆ సినిమాలని ప్రశంసించా.. ఆ ఇద్దరిలో ఆయనంటేనే ఇష్టం.. రాజమౌళి!

    |

    దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఇండియన్ సినిమాలోనే సంచలనం. రాజమౌళి రూపొందించిన బాహుబలి సిరీస్ సినిమా అభిమానులని ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాహుబలితో రాజమౌళి ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రంలో మరో సంచలనానికి సిద్ధం అవుతున్నాడు. కాఫీ విత్ కరణ్ షోలో రాజమౌళి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

     ఇష్టం లేకున్నా పొగిడా

    ఇష్టం లేకున్నా పొగిడా

    గతంలో చాలా సందర్భాల్లో ఇష్టం లేకున్నా కొన్ని చిత్రాలని ప్రశంసించానని రాజమౌళి తెలిపారు. ట్విట్టర్ లో కొన్ని సినిమాల గురించి ప్రస్తావించా. ఆ తర్వాత ఆ సినిమాలు రాణించలేదు. దీనితో నెటిజన్ల నుంచి వ్యతిరేకత ఎదురైందని రాజమౌళి తెలిపారు. కానీ ఇప్పుడు బాగా లేని చిత్రాల గురించి ట్వీట్ చేయడం మానేశా అని రాజమౌళి తెలిపారు. 2.0 చిత్ర యూనిట్ కు రాజమౌళి ట్విటర్ వేదికగా విడుదలకు ముందే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన లభించింది. రాజమౌళి కూడా విడుదల తర్వాత ఎలాంటి కామెంట్ చేయలేదు.

    వాళ్ళిద్దరిలో ఎవరు

    వాళ్ళిద్దరిలో ఎవరు

    శంకర్, సంజయ్ లీల భన్సాలీ ఇద్దరిలో ఎవరు విజనరీ దర్శకుడు అని కరణ్ జోహార్ ప్రశ్నించాడు. దీనికి రాజమౌళి సమాధానం ఇస్తూ నాకు నచ్చిన దర్శకుడు శంకర్ అని తెలిపారు. ప్రస్తుతం ఈ ఇద్దరు దర్శకులు సౌత్ లో భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయారు. బాహుబలి చిత్రంతో రాజమౌళి భారత సినిమాని ప్రపంచస్థాయికి తీసుకునివెళ్ళగలిగారు. 2.0 చిత్రంతో హాలీవుడ్ వాళ్లకు మనం తక్కువేం కాదు అని శంకర్ నిరూపించారు.

    నా బలం అదే

    నా బలం అదే

    దర్శకుడిగా నీలో ఉన్న బలం ఏంటని కరణ్ జోహార్ ప్రశ్నించగా.. తాను బలమైన ఎమోషన్ నేపథ్యంలో యాక్షన్ సన్నివేశాలు రూపొందించగలనని రాజమౌళి తెలిపాడు. ఉత్తరాది, దక్షణాది హీరోల గురించి ప్రస్తావిస్తూ.. బాలీవుడ్ హీరోలు తమకు నచ్చిన చిత్రాలు చేసుకుంటూ వెళ్లిపోతారు. కానీ సౌత్ హీరోలు అభిమానుల అంచనాలకు ప్రాధాన్యత ఇస్తారని రాజమౌళి తెలిపారు.

    మరో భారీ చిత్రం

    మరో భారీ చిత్రం

    బాహుబలి తర్వాత భారీ చిత్రాన్ని తెరకెక్కించే బాధ్యతని రాజమౌళి తీసుకున్నారు. రాంచరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ చిత్రం రూపొందితున్నసంగతి తెలిసిందే. 300 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2020లో ప్రేక్షకుల ముందుకు రానుంది. స్వాతంత్ర ఉద్యమ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతోందంటూ వార్తలు వస్తున్నాయి.

    English summary
    Rajamouli about Shankar and South heros. South heros gives priority to fans says Rajamouli
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X