»   » సౌతిండియాలో టాప్ కలెక్షన్ మూవీస్ (లిస్ట్)

సౌతిండియాలో టాప్ కలెక్షన్ మూవీస్ (లిస్ట్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గత మూడేళ్లుగా సౌతిండియా సినీ పరిశ్రమలో... ముఖ్యంగా తెలుగు, తమిళంలో పలు సినిమాలు బాక్సాఫీసు వద్ద మంచి బిజినెస్ చేసి అందరినీ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్య పరిచాయి. ఒకప్పుడు సౌత్ లో 100 కోట్లు వసూలు చేయడం అంటే గగనమే. కానీ ఇపుడు ఇక్కడ మార్కెట్ పెరిగింది. సౌత్‌లో స్టార్ హీరోల సినిమాలు రూ. 100 కోట్లు సాధించడం సర్వసాధారణం అయిపోయింది.

ఇటీవల విడుదలైన ‘బాహుబలి' మూవీ ఎవరి అంచనాలకు అందని విధంగా రూ. 500 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ సాధించి రికార్డు సృష్టించింది. ఇక వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ సాధించిన సౌత్ లో డజనకు పైగా ఉన్నాయి. అందులో తెలుగు సినిమాల వాటా తక్కువేమీ కాదు.


ఇప్పటి వరకు సౌత్ సినిమా పరిశ్రమలో అత్యధికంగా గ్రాస్ కలెక్షన్స్ సాధించిన సినిమాల వివరాలు స్లైడ్ షోలో...


బాహుబలి

బాహుబలి

బాహుబలి తెలుగు, తమిళం, మళయాలం, హిందీలో విడుదలై ఇప్పటి వరకు దాదాపు 600 కోట్లకుపైగా గ్రాస్ సాధించింది. సినిమా ఇంకా రన్ అవుతోంది.


రోబో

రోబో

రజనీకాంత్ నటించిన రోబో చిత్రం తెలుగు, తమిళం, హిందీలో విడుదలై ఓవరాల్ గా రూ. 289 కోట్ల గ్రాస్ సాధించింది.


శంకర్ ‘ఐ'

శంకర్ ‘ఐ'

శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తెరకెక్కిన ‘ఐ' మూవీ తెలుగు, తమిళం, హిందీలో విడుదలై రూ. 239 కోట్ల గ్రాస్ సాధించింది.


శివాజీ

శివాజీ

రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన శివాజీ మూవీ తెలుగు, తమిళం, హిందీలో విడుదలై రూ. 155 కోట్ల గ్రాస్ సాధించింది.లింగా

లింగా

రజనీకాంత్ నటించిన లింగా మూవీ రూ. 154 కోట్ల గ్రాస్ సాధించింది.


మగధీర

మగధీర

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ‘మగధీర' తెలుగు, తమిళం, మళయాలంలో విడుదలై దాదాపు 150 కోట్ల గ్రాస్ సాధించింది.


అత్తారింటికి దారేది

అత్తారింటికి దారేది

పవన్ కళ్యాన్ నటించిన అత్తారింటికి దారేది చిత్రం రూ. 131 కోట్ల గ్రాస్ సాధించింది.


తుపాకి

తుపాకి

విజయ్ నటించిన తుపాకి చిత్రం రూ. 125 కోట్ల గ్రాస్ సాధించింది.


కత్తి

కత్తి

విజయ్ నటించిన కత్తి సినిమా కూడా దాదాపు రూ. 125 కోట్ల గ్రాస్ సాధించింది.


సింగం 2

సింగం 2

సూర్య నటించిన సింగం 2 చిత్రం దాదాపు 122 కోట్ల గ్రాస్ సాధించింది.


శ్రీమంతుడు

శ్రీమంతుడు

శ్రీమంతుడు మూవీ 17 రోజుల్లోనే 119 కోట్ల గ్రాస్ సాధించింది. సినిమా ఇంకా రన్ అవుతోంది.


కాంచన 2

కాంచన 2

రాఘవలారెన్స్ కాంచన తెలుగు, తమిళంలో కలిపి రూ. 113 కోట్ల గ్రాస్ సాధించింది.


విశ్వరూపం

విశ్వరూపం


కమల్ హాసన్ విశ్వరూపం చిత్రం రూ. 108 కోట్ల గ్రాస్ సాధించింది.


గబ్బర్ సింగ్

గబ్బర్ సింగ్

పవన్ కళ్యాన్ గబ్బర్ సింగ్ చిత్రం రూ. 104 కోట్ల గ్రాస్ సాధించింది.


రేసు గుర్రం

రేసు గుర్రం

అల్లు అర్జున్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన రేసు గుర్రం రూ. 102 కోట్ల గ్రాస్ సాధించింది.


దూకుడు

దూకుడు

మహేష్ బాబు నటించి దూకుడు చిత్రం దాదాపు రూ.100 కోట్ల గ్రాస్ సాధించింది.


English summary
Past three years has been a great one for some of the big stars of Tamil and Telugu cinema with their films having performed well at the box office. Many south Indian actors have propelled their movies to join the 100 Crs club in earnings at the box office, an achievement in itself.
Please Wait while comments are loading...